తెలంగాణ

telangana

By

Published : Sep 16, 2019, 11:43 PM IST

ETV Bharat / state

జీహెచ్​ఎంసీ రూ.కోటి ఆదాయం తెచ్చిన పారిశుద్ధ్య ఉల్లంఘన

స్వచ్ఛత నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జీహెచ్​ఎంసీ విధించిన జరిమానా రూ. కోటికి చేరింది. నాలుగు నెలలుగా చేపట్టిన ప్రత్యేక డ్రైవ్​లో సోమవారం వరకు 8500 మంది వ్యక్తులు, పలు సంస్థల నుంచి జరిమానా వసూలు చేశారు.

స్వచ్ఛత ఉల్లంఘనలపై జీహెచ్​ఎంసీ ఆదాయం రూ.కోటి

గ్రేట‌ర్ హైదరాబాద్​ పరిధిలో స్వచ్ఛత‌ నిబంధనను ఉల్లంఘించిన వారిపై జీహెచ్ఎంసీ విధించిన జ‌రిమానా కోటి రూపాయలకు చేరింది. భవన నిర్మాణ వ్యర్థాలు రోడ్లపై వేయడం, చెత్తను త‌గ‌ల‌బెట్టడం, నాలాలో వ్యర్థాలు వేయ‌డం, బహిరంగ మలమూత్ర విసర్జన త‌దిత‌ర అంశాల‌పై జ‌రిమానాల‌ను విధించారు. తడి పొడి చెత్తసేకరణ కోసం ప్రత్యేక వ్యవస్థలు ఏర్పాటు చేసినా.. సక్రమంగా వినియోగించకుండా నిర్లక్ష్యంగా రోడ్డుపై వేసే వారిపై జీహెచ్​ఎంసీ కొరడా ఝుళిపిస్తోంది. ప్రజా బాహుళ్యంలో చైతన్యం తెచ్చేందుకు వినూత్న కార్యక్రమాలను చేపట్టింది. నాలుగు నెలల్లో 8,500 మంది వ్యక్తులు, పలు సంస్థలకు జరిమానా విధించింది. చందాన‌గ‌ర్‌ స‌ర్కిల్‌ నుంచి అత్యధికంగా 518 జ‌రిమానాల ద్వారా రూ. 16 లక్షలు వ‌సూలు చేసింది.

స్వచ్ఛత ఉల్లంఘనలపై జీహెచ్​ఎంసీ ఆదాయం రూ.కోటి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details