తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రేటర్​ పరిధిలో కరోనా కట్టడికి ప్రత్యేక అధికారులు:లోకేశ్​కుమార్​

గ్రేటర్​పరిధిలో కరోనా కట్టడికై జీహెచ్​ఎంసీ చర్యలను వేగవంతం చేసింది. పాజిటివ్​కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక అధికారులను నియమిస్తూ బల్దియా కమిషనర్​ లోకేశ్​కుమార్​ ఉత్తర్వులు జారీచేశారు.

Ghmc appointed_Special_Officers_On_Corona preventive actions in hyderabad
గ్రేటర్​ పరిధిలో కరోనా కట్టడికి ప్రత్యేక అధికారులు:లోకేశ్​కుమార్​

By

Published : Apr 14, 2020, 5:57 AM IST

కరోనా నివారణ చర్యలను జీహెచ్ఎంసీ వేగవంతం చేసింది. ఇప్పటి వరకు నమోదవుతున్న కేసుల్లో సింహభాగం గ్రేటర్​లోనే ఉన్నందున ఇక్కడ 17 సర్కిళ్లలో జీహెచ్ఎంసీ ప్రత్యేకాధికారులను నియమిస్తూ బల్దియా కమిషనర్ లోకేశ్​కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. కేసులు అధికంగా ఉన్న ఏరియాల్లో ఇప్పటికే 126 కంటైన్​మెంట్ ప్రాంతాలను గుర్తించారు. అక్కడ అందుతున్న సేవలతో పాటు... కరోనా కట్టడిపై ఈ అధికారులు ప్రత్యేక దృష్టి సారించనున్నారు.

  • మూసాపేట్, కూకట్​పల్లికి : జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ రాహూల్ రాజ్
  • ఖైరతాబాద్, జూబ్లిహిల్స్​కు : జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ ప్రియంక
  • కాప్రా, మల్కాజిగిరికి : జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ జయరాజ్
  • కుత్బుల్లాపూర్, అల్వాల్​కు : అదనపు కమిషనర్ శంకరయ్య
  • రాజేంద్ర నగర్​కి : జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ విజయ లక్ష్మి
  • ఉప్పల్, ఎల్బీ నగర్​కి : అడిషనల్ కమిషనర్ యాదగిరి రావు
  • ముషీరాబాద్, అంబర్​పేట్​కి : అడిషనల్ కమిషనర్ క్రిష్ణలను నియమించారు.
  • సికింద్రాబాద్, బేగంపేట్ : జాయింట్ కమిషనర్ సరోజా
  • హయత్ నగర్, సరూర్​నగర్ : జాయింట్ కమిషనర్ పంకజ
  • మోహిదీపట్నం, గోశామహల్ : జాయింట్ కమిషనర్ సంధ్య
  • యూసుఫ్ గూడ, శేరిలింగంపల్లి : జాయింట్ కమిషనర్ వాణిశ్రీ
  • మలక్ పేట్, సంతోష్​నగర్ : ఈస్ట్ అధికారి విక్టర్
  • చాంద్రాయన్​ గుట్ట, చార్మినార్​కు : అధికారి వెంకటేశ్వర్లు
  • కార్వాన్​కు : రవీందర్ రాజు
  • గాజులరామారంలో సీఈ కిషన్
  • చందానాగర్, పటాన్​చెరులో ఎస్ఈ శ్రీనివాస్
  • ఫలక్ నుమాలో ఎస్ఈ శ్రీలక్ష్మి లను నియమించారు.

ABOUT THE AUTHOR

...view details