తెలంగాణ

telangana

ETV Bharat / state

వ్యాపారుల ఇష్టం.. పండ్ల రైతుల ప్రాప్తం - mango farmers problems

లాక్‌డౌన్ ఆంక్షల ప్రభావం కీలకమైన వ్యవసాయ, మార్కెటింగ్​ రంగాలపై తీవ్రంగా చూపుతోంది. కరోనా నేపథ్యంలో... చిల్లర అమ్మకాలు తగ్గిపోవడం వల్ల రైతన్న పరేషాన్ అవుతున్నాడు. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు.. మామిడి, బత్తాయి ఎగుమతులు అంతంత మాత్రమే ఉండడం ఫలితంగా గిట్టుబాటు ధరలు లేవని రైతుల నుంచి బత్తాయి కొనడం వ్యాపారులు మానేశారు. రెండు రోజులకే దిల్లీలోని ఆజాద్‌పుర మండీ మూతపడటం... ఎగుమతులు లేకపోవడం వల్ల చెట్లపైనే బత్తాయి వదిలేస్తున్నాయి. మామిడి రైతుల పరిస్థితి అలానే ఉంది.. వ్యాపారుల ఇష్టం.. రైతుల ప్రాప్తం అన్న చందంగా తయారైంది.

fruit farmers facing issues during lockdown in telangana
వ్యాపారుల ఇష్టం.. పండ్ల రైతుల ప్రాప్తం

By

Published : May 1, 2020, 2:24 PM IST

లాక్‌డౌన్ ఆంక్షల ప్రభావం పండ్ల ఉత్పత్తుల అమ్మకాలపై అధికంగా ఉంది. చిల్లర అమ్మకాలు లేని దృష్ట్యా... టోకు మార్కెట్లలో ధరలు వెలవెలబోతున్నాయి. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు పండ్లు ఎగుమతులు పెరగనందున స్థానిక పంటలకు డిమాండ్​ పడిపోయింది. కేంద్రం ఏటా ప్రకటించే కనీస మద్దతు ధరల పంటల జాబితాలో పండ్ల తోటలు లేకపోవడమూ రైతుల దుస్థితికి కారణం అవుతోంది.

గత ఏడాది ఇదే సమయంలో మామిడి, బత్తాయి, పుచ్చకాయ వంటి పండ్లకు ఉన్న ధరలు ఇప్పుడు సగానికి పైగా పడిపోయాయి. గడ్డి అన్నారం మార్కెట్‌లో గత ఏడాది ఇదే సమయంలో క్వింటా ధర రూ.7,500 ఉండగా... ఈసారి అంతకన్నా 50 శాతం తగ్గడం గమనార్హం. మామిడికాయల రాక పెరుగుతున్నా.. ధర తగ్గుతుండటం గమనార్హం. కొన్ని ప్రాంతాల్లో ఐకేపీ సంఘాలు మామిడి కాయలు కొంటున్నా.. రైతులు లాభపడింది లేదు. ఉదాహరణకు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో ఐకేపీ సంఘాలు.. క్వింటా ధర రూ.1,400 నుంచి 3800 రూపాయల మాత్రమే చెల్లిస్తున్నాయి. వరంగల్ నగరంలోను రూ.వెయ్యి నుంచి రూ. 3,800 చొప్పున ధర పలుకుతోంది. చిల్లర అమ్మకాలు తగ్గినందున ఇతర రాష్ట్రాల వ్యాపారుల నుంచి ఆర్డర్లు పెద్దగా రావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు.

మూడు రోజుల ముచ్చట..

అత్యధికంగా బత్తాయి సాగుచేసే నల్గొండ జిల్లాలోనే రైతుకు భరోసా కరవైంది. బత్తాయి మార్కెటింగ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాల న్యాయం చేస్తుందని హామీ ఇచ్చి.. నల్గొండ జిల్లా కేంద్రంలో బత్తాయి కొనుగోలు కేంద్రం ప్రారంభించినా... అది మూడు రోజుల ముచ్చటగా మిగిలింది. కొనుగోలు కేంద్రానికి బత్తాయిలు తీసుకువస్తున్న.. గిట్టుబాటు ధర లేదంటూ వ్యాపారులు కొనడం మానేశారు. ఫలితంగా కొనుగోలు కేంద్రానికి పంట తీసుకురావడం మానేశారు రైతులు.

పెరిగిన సాగు విస్తీర్ణం..

బత్తాయి రైతును ఆదుకునేందుకు ఆసియాలోనే అతి పెద్దదైన దిల్లీలోని ఆజాద్​పుర మండీని మార్కెట్​ను 24 గంటలూ తెరిపిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కేంద్ర హోం సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి చొరవతో జిల్లా నుంచి 40 టన్నులు దిల్లీక లారీల్లో సరకు పంపారు. అక్కడ ఓ వ్యాపారికి కరోనా పాజిటివ్ రావడం వల్ల మండీని మూసివేశారు. దీంతో బత్తాయి రైతు పరిస్థితి మళ్లీ మొదటి కొచ్చింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏటా 62 వేల ఎకరాల విస్తీర్ణంలో బత్తాయిని సాగు చేస్తారు. ఈఏడాది భూగర్భ జలాల లభ్యత, ప్రాజెక్టుల్లో నీళ్లు ఉండటంతో సాగు విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే స్వల్పంగా పెరిగింది.

ఇవీచూడండి:రైతులను చైతన్య పరిచేందుకు విపుల ప్రణాళిక

ABOUT THE AUTHOR

...view details