తెలంగాణ

telangana

ETV Bharat / state

Free Ration: ప్రారంభమైన ఉచిత రేషన్ బియ్యం పంపిణీ

రాష్ట్రంలో ఉచిత రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి ఈనెల 20 తేదీ వరకూ సరుకులు అందించనున్నారు. వచ్చే నెలలోనూ ఈ ఉచిత బియ్యం పంపిణీ కొనసాగనుంది.

ప్రారంభమైన ఉచిత రేషన్ బియ్యం పంపిణీ
ప్రారంభమైన ఉచిత రేషన్ బియ్యం పంపిణీ

By

Published : Jun 5, 2021, 10:31 AM IST

Updated : Jun 5, 2021, 10:50 AM IST

ప్రారంభమైన ఉచిత రేషన్ బియ్యం పంపిణీ

రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఉచిత రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి 20వ తేదీ వరకు బియ్యం పంపిణీ చేయనున్నారు. ఉచిత బియ్యం కోసం చౌక ధరల దుకాణాల వద్ద సందడి నెలకొంది‌. ఉదయం 6 గంటల నుంచే రేషన్ కార్డుదారులు దుకాణాల వద్ద లైన్లలో నిల్చున్నారు.

కరోనా, లాక్​డౌన్​ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లో ఒక్కొక్కరికీ ఇచ్చే 5 కిలోలతో పాటు అదనంగా మరో 10 కిలోలు కలిపి మొత్తం 15 కిలోల చొప్పున అందిస్తున్నారు. సాధారణ రాయితీ ధరపై కిలో పంచదార, జీహెచ్ఎంసీలో 2 కిలోల గోధుమలు, పురపాలిక సంస్థల్లో 1 కిలో గోధుమలు పంపిణీ చేస్తున్నారు.

జులై మాసంలోనూ ఇదే మాదిరిగా ఉచిత బియ్యం ఇవ్వనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17,500 చౌక ధరల దుకాణాల ద్వారా 87.54 లక్షల కుటుంబాలకు 4 లక్షల 4 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం, పౌర సరఫరాల శాఖ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది.

ఇదీ చూడండి: WEATHER REPORT: ఎల్లుండిలోగా రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు

Last Updated : Jun 5, 2021, 10:50 AM IST

ABOUT THE AUTHOR

...view details