కరోనా బారినపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేసేందుకు మహీంద్ర లాజిస్టిక్స్ సంస్థ ముందుకొచ్చింది. ఆక్సిజన్ ఆన్ వీల్స్ పేరిట నాలుగు జీపులను రాచకొండ పోలీసులకు అందజేసింది. రాచకొండ పోలీసులతో కలిసి సంయుక్తంగా ఈ సంస్థ కొవిడ్ సోకిన వారి సౌకర్యార్థం వీటిని అందించినట్లు సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.
మహీంద్ర లాజిస్టిక్స్ సంస్థ ఉదారత.. ఆక్సిజన్ సిలిండర్ల ఉచిత సరఫరా
కరోనా బారినపడి ప్రాణవాయువు కోసం అల్లాడుతున్న వారి పట్ల మహీంద్ర లాజిస్టిక్స్ సంస్థ ఉదారత చాటుకుంది. ఈ మేరకు ఆక్సిజన్ ఆన్ వీల్స్ పేరిట నాలుగు జీపులను రాచకొండ పోలీసులకు అందజేసింది. అవసరమైన వారు 9490617234, 7386420259 నెంబర్లను సంప్రదించాలని సీపీ మహేశ్ భగవత్ సూచించారు.
ఆక్సిజన్ సరఫరాకు వాహనాలు
ఆక్సిజన్ సిలిండర్లు అవసరమైన వారు పోలీస్ కొవిడ్ కంట్రోల్ కేంద్రం 9490617234, మహీంద్ర లాజిస్టిక్స్ హెల్ప్‌లైన్ 7386420259 నెంబర్లకు ఫోన్ చేయాలని సీపీ సూచించారు. ఆక్సిజన్ సిలిండర్లు అయిపోయిన వెంటనే.. ఈ వాహనం ద్వారా సిలిండర్ అందించి.. ఖాళీ సిలిండర్‌ను తీసుకొచ్చి రీ-ఫిల్లింగ్ చేస్తామని ఆయన వివరించారు. ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు.
ఇదీ చూడండి: వైరస్ వ్యాప్తి తగ్గేవరకు జాగ్రత్తగా ఉండాలి: సీపీ అంజనీకుమార్