తెలంగాణ

telangana

ETV Bharat / state

Foods Should Avoid Eating With Curd Telugu : చేప మాత్రమే కాదు.. ఇవి తిన్నాక కూడా పెరుగు అస్సలు తినొద్దు

Foods Should Avoid Eating With Curd Telugu : ఇంట్లో.. బయట.. మనం ఏదైనా తిన్నామంటే ముఖ్యంగా నాన్‌వెజ్‌ తిన్నప్పుడు చివర్లో పెరుగు తినాలి అనిపిస్తుంది. కానీ కొన్ని ఆహార పదార్ధాలు తిన్నప్పుడు పెరుగు తినకపోవడమే మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు అవేంటో చూద్దామా మరి..!

curd
Food Should be Avoided Eating With Curd

By ETV Bharat Telangana Team

Published : Aug 25, 2023, 1:33 PM IST

Foods Should Avoid Eating With Curd Telugu : అన్నం తిన్నాక కానీ ఏదీ తిన్నా చివర్లో ప్రతి ఒక్కరు ఇది తప్పకుండా తింటారు. ఇది తింటే తప్ప మనం భోజనం పూర్తయినట్లుండదు. ముఖ్యంగా మన తెలుగువారందరికి ఇది చాలా ఫేవరెట్. ఇప్పుడు గుర్తు పట్టి ఉంటారు దేని గురించి మాట్లాడుకుంటున్నామో. కూర, చారు, పచ్చడి, చికెన్‌.. ఏవి ఎంత రుచికరమైనవి తిన్నా.. చివర్లో పెరుగన్నం తినందే భోజనం పూర్తి అయినట్లు ఉండదు. అన్నం తరువాతే కాదు.. చపాతీలు, నాన్‌ లాంటివి తిన్నా.. ఎంత తిన్నా.. పెరుగు తింటే అదో తృప్తి. పెరుగులో విటమిన్‌, యాంటి ఆక్సిడెంట్లు, ఖనిజాలు ఉంటాయి అవి ఆరోగ్యానికి మంచిది. అయితేకొన్ని పదార్థాలతో పాటు పెరుగు తినకూడదని చాలా మందికి తెలియదు. ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన ఆహార పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అవేంటంటే..?

ఇవి తిన్నాక పెరుగు తినొద్దు
  • వేడి పదార్థాలు తిన్న వెంటనే పెరుగు తినడం మంచిది కాదు. అలాగే వేడి అన్నంలో పెరుగు కలిపితినకూడదని ఆరోగ్య నిపుణులు తెలిపారు.
  • పరాఠాను పెరుగుతో కలిపి తింటే రుచికి బాగుండవచ్చు.. కానీ అలా తినడం వల్ల ఆరోగ్యకరం కాదు. ఎసిడిటీ, కడుపుబ్బరం, పేగులకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ
  • బెల్లంలో వేడి చేసే గుణం ఎక్కువ.. పెరుగు తినడం వల్ల శరీరానికి చలవ చేస్తుంది. ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల జలుబు, దగ్గు, జ్వరాలకు వచ్చే అవకాశం.
  • కొన్ని వంటకాల్లో చేసేటప్పుడు అందులో పాలు, పెరుగు కలిపి వేస్తుంటాం. నిజానికి ఇది ఆరోగ్యకరం కాదు. అలాతినడం వల్ల పొట్టలో వికారం, ఇన్ఫెక్షన్లు తదితర సమస్యలు తలెత్తుతాయి
  • కాఫీ, టీ లాంటి వేడి పానీయాలు తాగిన వెంటనే పెరుగు తినడం లేదా పెరుగు కలిపిన పదార్థాలు.. కర్డ్‌ శాండ్‌విచెస్‌, దహి కబాబ్‌ లాంటివి తింటే జీవక్రియ (మెటబాలిజం) దెబ్బతింటుంది.

Neck Pain Treatment : మెడనొప్పికి కారణాలేంటో తెలుసా?.. ఇలా చేస్తే అంతా సెట్​!

ఇవి తిన్నాక పెరుగు తినొద్దు
  • పాలతోనే కాకుండా.. పెరుగుతో కూడా మ్యాంగోషేక్‌ చేస్తారు అలా తాగడం ఆరోగ్యకరం కాదు. కొంతమంది పెరుగన్నంలో మామిడిపండు గుజ్జు కలిపి తింటారు. కానీ మామిడిపండును పెరుగుతో కలిపి తినడం వల్ల పులియబెట్టినట్టు అవుతుంది. దీనివల్ల తర్వాతి కాలంలో అరగకపోవడం, ఎసిడిటీ లాంటి అనారోగ్యాలను దారితీస్తుంది.
  • పెరుగుతో ఉల్లిపాయ తినడం చాలామందికి ఇష్టం. కానీ ఈ కాంబినేషన్‌తో తినడం వల్ల దురద, మంట, దద్దుర్లు లాంటి చర్మసమస్యలు వస్తాయని తాజాగా అధ్యయనాల్లో తేలింది.
  • చేప తిన్నాక చాలా మంది పెరుగు తినరు. కానీ దానికి కారణం ఎవ్వరికి తెలియదు.. చేప తిన్నాక పెరుగు తినడం వల్ల ఆహారం త్వరగా జీర్ణం కాదు.

ABOUT THE AUTHOR

...view details