ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ప్రకారం తెలంగాణలో ఇప్పటివరకు 2.05 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం లబ్ధిదారులకు అందించినట్లు భారత ఆహార సంస్థ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఈ పంపిణీ చేపట్టింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనలో భాగంగా ఏప్రిల్ నుంచి జూన్ వరకు ప్రతి లబ్ధిదారుడికి అదనంగా 5 కిలోలు ఇవ్వాలన్న నిర్ణయానికి అనుగుణంగా కేంద్రం... ప్రతి నెలకు 95వేల 810 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తెలంగాణకు కేటాయించింది. దీని ద్వారా మొత్తం 1.91 కోట్ల మంది లబ్ధి పొందనున్నారు.
తెలంగాణకు 2.05 లక్షల మెట్రిక్ టన్నులు అందించాం: ఎఫ్సీఐ
తెలంగాణలో ఇప్పటివరకు 2.05 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం లబ్ధిదారులకు అందించినట్లు భారత ఆహార సంస్థ ప్రకటించింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనలో భాగంగా బియ్యం పంపణీ చేసినట్లు తెలిపింది.
తెలంగాణకు 2.05 లక్షల మెట్రిక్ టన్నులు అందించాం: ఎఫ్సీఐ