హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిల భారత రైతు సంఘాల పోరాట సమన్వయ సమితి సమావేశం నిర్వహించారు. దేశ భవిష్యత్ కోసం వ్యవసాయ రంగాన్ని రక్షించేందుకు జనవరి 8న తలపెట్టిన "గ్రామీణ భారత్ బంద్"ను విజయవంతం చేయాలని రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చారు.
స్వామినాథన్ కమిషన్ సిఫారసులు
స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయటంతో పాటు రైతులను రుణాల నుంచి విముక్తి చేయాలన్న 21 రకాల డిమాండ్లపై బంద్ చేపడతున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా జరగనున్న ఈ బంద్‌లో రైతులు, కూలీలు, చేతివృత్తిదారులు సహా అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయడంపై విస్తృతంగా చర్చించారు.