స్వర్గీయ అటల్బిహారీ వాజ్‌పేయి జన్మదిన వేడుకలను మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పొంగులేటి, ఆకుల విజయ, పార్టీ శ్రేణులు రక్తదానం చేశారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు వాజ్‌పేయి పేరు ఉంటుందని మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ అన్నారు. మోదీ నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
భాజపా రాష్ట్ర కార్యాలయంలో వాజ్‌పేయి జన్మదిన వేడుకలు - ex prime minister Atal Bihari Vajpayee 95th birth anniversary celebrations
హైదరాబాద్లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి జన్మదిన వేడుకలు నిర్వహించారు. మహిళా మోర్చా అధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయ పాల్గొన్నారు.
భాజపా రాష్ట్ర కార్యాలయంలో వాజ్‌పేయి జన్మదిన వేడుకలు