తెలంగాణ ఒలింపిక్ అసోషియేషన్ అధ్యక్ష పదవికి జయేశ్‌రంజన్ వేసిన నామినేషన్ తిరస్కరణకు కారణం చెప్పలేదనడం అబద్దమని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి స్పష్టం చేశారు. తిరస్కరణకు గల కారణాలను రిటర్నింగ్ అధికారి మెయిల్ రూపంలో ఇచ్చారని పేర్కొన్నారు.
'అధ్యక్ష పదవికి జయేశ్‌రంజన్ అర్హుడు కాదు'
తెలంగాణ ఒలింపిక్ అసోషియేషన్ అధ్యక్ష పదవికి పోటీ చేయటానికి కావాల్సిన అర్హతలు జయేశ్‌రంజన్‌కు లేవని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి స్పష్టం చేశాడు. నామినేషన్ తిరస్కరణకు కారణాలను అధికారులు వెల్లడించారని పేర్కొన్నారు.
అధ్యక్ష పదవికి పోటీ చేయాలంటే ఏదో ఒక అసోషియేషన్‌లో ఈసీ సభ్యుడై ఉండాలన్న జితేందర్‌రెడ్డి... జయేశ్‌రంజన్ ఏ స్పోర్ట్స్ అసోషియేషన్లోనూ సభ్యుడు కాదని స్పష్టం చేశారు. తెలంగాణ ఒలంపిక్ అసోషియేషన్ అధ్యక్ష పదవికి రంగారావును తానే సిఫారసు చేసినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. ఇప్పటికే ఒక టర్మ్ అధ్యక్షునిగా పనిచేసిన తనకు పదవిపై ఆసక్తి లేదన్నారు. జయేశ్ రంజన్ నామినేషన్ వేసినందునే తానూ రంగంలోకి దిగినట్లు వివరించారు. తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్‌ను నడపటానికి ఏడాదికి రూ. 30లక్షలు కావాలని పేర్కొన్నారు. దిల్లీలో ఎన్నికలు జరపటానికి ఏజీఎం సమావేశంలో అందరూ అంగీకరించారని జితేందర్‌రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: నా వల్లే చనిపోయాడు.. నేనూ ఉండలేను!