తెలంగాణ

telangana

ETV Bharat / state

'కమీషన్ల కోసం కేసీఆర్​ తెలంగాణకు ద్రోహం చేస్తున్నారు' - nagam janardhan reddy fire on kcr

ముఖ్యమంత్రి కేసీఆర్​పై మాజీ మంత్రి నాగం జనార్దన్​రెడ్డి ధ్వజమెత్తారు. నదుల అనుసంధానం పేరుతో కమీషన్ల కోసం కేసీఆర్​ తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. ప్రాజెక్టులపై తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేశారు.

ex minister nagam janardhan reddy comments on cm kcr
'కమీషన్ల కోసం కేసీఆర్​ తెలంగాణకు ద్రోహం చేస్తున్నారు'

By

Published : Jan 15, 2020, 5:14 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నదుల అనుసంధానం పేరుతో కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు కొట్టేసేందుకు తెలంగాణకు తీరని ద్రోహం చేస్తున్నారని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఆరోపించారు. విశ్వాస ఘాతుకానికి, నమ్మక ద్రోహానికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. కృష్ణానది పరివాహక ప్రాంతం అధికంగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి తక్కువ నీటి కేటాయింపులు ఏమిటని ప్రశ్నించారు. ఇచ్చి పుచ్చుకోవడం...ఏమిటి అది ఏమైనా వాళ్ల ఇంటి వ్యవహారమా అని నిలదీశారు.


ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు కాలువలు వెడల్పు చేస్తున్నారని... అందుకోసం 23వేల కోట్లు నిధులు కేటాయించారని...అదే జరిగితే తెలంగాణ రాష్ట్రం ఎడారిగా మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నీటి పంపకాలపై కేసీఆర్‌కు కనీస అవగాహన లేదని... తక్షణమే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్ చర్యలను అడ్డుకుని..మహబూబ్ నగర్ జిల్లా రైతాంగ ప్రయోజనాలను కాపాడుకుని తీరతామని ఆయన స్పష్టం చేశారు.

'కమీషన్ల కోసం కేసీఆర్​ తెలంగాణకు ద్రోహం చేస్తున్నారు'

ఇవీ చూడండి: రాజ్​భవన్​లో ప్రజాదర్బార్ నిర్వహిస్తాం...

ABOUT THE AUTHOR

...view details