ప్రజలకు మరింత అందుబాటులో ఉండటానికి రాజ్ భవన్లో నెలలో ఒకరోజు ప్రజాదర్బార్ నిర్వహిస్తామని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తెలిపారు. అందుకోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. వైద్యురాలిగా, రాజకీయ నేతగా తమిళనాడులో ప్రజలకు సేవ చేశానని... రాజ్ భవన్‌ను ప్రజాభవన్‌గా భావించి ప్రజలు తమ సమస్యలు తనకు చెప్పుకోవచ్చని తమిళిసై సూచించారు.
తమిళనాడు, తెలంగాణలో చారిత్రక ప్రాంతాలెన్నో ఉన్నాయని... ఇరు రాష్ట్రాల మధ్య పర్యాటకంగా పర్యటించేందుకు తగిన ఏర్పాటు చేయాలని తమిళిసై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు. ఈ మేరకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడుతానని గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: కాంగ్రెస్ సవాల్‌ని స్వీకరిస్తున్నా... పుర ప్రచారానికి 'బయటికి' రాను!