లాక్డౌన్ నేపథ్యంలో మానవత్వాన్ని చాటుకుంటున్నారు హైదరాబాద్ గడ్డి అన్నారం డివిజన్ మాజీ కౌన్సిలర్ ప్రేమ్‌నాథ్ గౌడ్. సొంత ఖర్చులతో గత ఇరవై తొమ్మిది రోజుల నుంచి ప్రతిరోజూ 500 మంది పేదలకు, వలస కూలీలకు అన్నదానం చేస్తున్నారు. ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించడం కోసం ఓ ఆటోను డివిజన్ మెుత్తం తిప్పుతున్నామని ఆయన తెలిపారు.
ప్రతిరోజు 500 మందికి మాజీ కౌన్సిలర్ అన్నదానం - lockdown
లాక్డౌన్ నేపథ్యంలో పలువురు తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. హైదరాబాద్ గడ్డిఅన్నారం డివిజన్ మాజీ కౌన్సిలర్ ప్రేమ్‌నాథ్‌గౌడ్ ప్రతిరోజూ 500 మంది పేదలకు అన్నదానం చేస్తున్నారు.
![ప్రతిరోజు 500 మందికి మాజీ కౌన్సిలర్ అన్నదానం ex councelor food distribution in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6988723-127-6988723-1588158214532.jpg)
ప్రతిరోజు 500 మందికి మాజీ కౌన్సిలర్ అన్నదానం
లాక్డౌన్ సాగినన్ని రోజులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. రంజాన్ నేపథ్యంలో ముస్లిం సోదరులకు ప్రతి రోజు పది కేజీల బియ్యంతో వంట చేసి అందజేస్తామని ప్రేమ్‌నాథ్‌గౌడ్ తెలిపారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో తగ్గుతోన్న కరోనా కేసులు