తెలంగాణ

telangana

ETV Bharat / state

టాపర్స్​గా నిలబెట్టేందుకు విద్యార్థులకు స్పెషల్​ టిఫిన్స్​ - ముషీరాబాద్​ పాఠశాల విద్యార్థులకు సాయంత్రం అల్పాహారం

వారంతా నిరుపేద విద్యార్థులు. సుమారు పదిగంటలకు పైగా పాఠశాలలో పుస్తకాలతో కుస్తీ పడుతారు. మంచి ఫలితాలు రాబట్టేందుకు ఉపాధ్యాయులు, విద్యార్థుల ఆసక్తితో సాయంత్రం ఎక్కువ సమయం ఉండి.. ప్రత్యేక తరగతులు నిర్వహించుకుంటూ కష్టపడుతున్నారు. ఆసక్తి ఉన్నా... ఆకలి, నీరసంతో శ్రద్ధ పెట్టలేకపోతూ ఇక్కట్లు పడుతున్నారు. గమనించిన కొందరు దాతలు... అల్పాహారం అందిస్తూ... మానవత్వాన్ని చాటుకుంటున్నారు.

EVENING SNACKS PROVIDING TO GOVERNMENT SCHOOL STUDENTS
EVENING SNACKS PROVIDING TO GOVERNMENT SCHOOL STUDENTS

By

Published : Feb 10, 2020, 6:39 PM IST

టాపర్స్​గా నిలబెట్టేందుకు విద్యార్థులకు స్పెషల్​ టిఫిన్స్​

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే నిరుపేద విద్యార్థులు మట్టిలో మాణిక్యాల్లా తయారవుతున్నారు. తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు తీసిపోకుండా... తీర్చిదిద్దాలని శ్రమిస్తున్నారు ప్రభుత్వ ఉపాధ్యాయులు. పదో తరగతి చదివే విద్యార్థులకు ఉదయం పూట పాఠశాల ప్రారంభానికి గంట ముందు, సాయంత్రం అదనంగా మరో గంట ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.

అలసటతోనే పుస్తకాలతో కుస్తీ...

పాఠశాలకు తొందరగా రావాలని కొందరు విద్యార్థులు అల్పాహారం తిని వస్తే... మరికొందరు తినకుండానే వస్తున్నారు. ఆకలేసినా సరే... మధ్యాహ్నం భోజనం వరకు వేచి ఉండాల్సిందే..! ఇక సాయంత్రం ప్రత్యేక తరగతులు పూర్తయ్యే సమయం వరకు పుస్తకాలతో కుస్తీపడుతూ... నీరసించిపోతున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల పరిస్థితి చెప్పనక్కర్లేదు.

బలాన్నిచ్చే అల్పాహారం....

విద్యార్థులు నీరసించకూడదని తలచిన ప్రభుత్వం బిస్కెట్లు, అరటిపళ్లను సాయంత్రం ఇస్తున్నా... ఆకలి తీర్చటంలో విఫలమవుతోంది. విద్యార్థుల ఇక్కట్లను గుర్తించిన హిదాయత్ వెల్ఫేర్ ఫౌండేషన్ అధ్యక్షుడు మహమ్మద్ షాహెద్, రాజాపేట ఛారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు ఆంజనేయులు కలిసి సాయంత్రం అల్పాహారం అందిస్తున్నారు. హియాయత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత ఐదేళ్లుగా విద్యార్థులకు అల్ఫాహారం అందిస్తున్నారు. ప్రతిరోజు జ్యూస్, పళ్లు, చిక్కీలు అందజేస్తున్నారు. ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న 100 విద్యార్థులకు బలాన్ని చేకూర్చే టిఫిన్లు ఇచ్చారు. పిల్లలకు ఇష్టమైన అల్పాహారాన్ని అడిగిమరి అత్యంత నాణ్యంగా తయారుచేయించి వాళ్లే స్వయంగా వడ్డిస్తున్నారు.

అల్పాహారంతో ఉత్సాహం రెట్టింపైంది...

పొద్దునెప్పుడో వచ్చి సాయంత్రం వరకూ ఉంటున్న తమకు మధ్యాహ్న భోజనం తప్పా మరే అల్పాహారం లేకపోవటం వల్ల నీరసించిపోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. అలసటతో చదువుపైన శ్రద్ధ పెట్టలేక... ఇబ్బంది పడుతున్నామంటున్నారు. సాయంత్రం అల్పాహారం ఇస్తే... చదువుపైనే పూర్తి శ్రద్ధ పెట్టి... మరింత శ్రమించి మంచి ఫలితాలు రాబట్టేందుకు కృషి చేస్తామంటున్నారు. అల్పాహారం అందిస్తున్న ట్రస్ట్​ సభ్యులకు కృతజ్ఞతలు చెబుతున్నారు.

మరింత ఎక్కువ సమయం కృషి...

మంచి ఫలితాలు రాబట్టేందుకు ఉపాధ్యాయులు తమవంతు కృషి చేసినప్పటికీ... ఎక్కువ సమయం కావటం వల్ల పిల్లలు నీరసించిపోవటాన్ని తాము తీర్చలేకపోయామన్నారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు. ట్రస్ట్​ సభ్యులు ఇస్తున్న అల్పాహారం వల్ల పిల్లలు, ఉపాధ్యాయులు మరింత ఎక్కువ సమయం గడుపుతూ... కష్టపడుతున్నారని తెలిపారు.

ఇవీ చూడండి:మేడారం జాతరలో కృత్రిమ మేధ సఫలీకృతం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details