తెలంగాణ

telangana

ETV Bharat / state

మీ దగ్గర పనిచేశా.. మీ గురించి తెలియదా?: ఈటల

అసెన్డ్‌ భూములు ఆక్రమించానంటూ చేసిన ఆరోపణలను మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఖండించారు. అధికారం ఉంది కదా అని ఇష్టారీతిన కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అరెస్టులు, కేసులకు భయపడేది లేదన్న ఆయన.. ధైర్యంగా ఎదుర్కొంటానని వివరించారు.

By

Published : May 3, 2021, 1:10 PM IST

Updated : May 3, 2021, 3:08 PM IST

etela
మీ దగ్గర పనిచేశా.. మీ గురించి తెలియదా?: ఈటల

మీ దగ్గర పనిచేశా.. మీ గురించి తెలియదా?: ఈటల

పౌల్ట్రీ విస్తరణ పనుల కోసం షెడ్లు వేసుకున్నామని ఈటల రాజేందర్​ పేర్కొన్నారు. మీరు ఏది చెబితే అది చేసే అధికారులు మీ చేతుల్లో ఉన్నారని వెల్లడించారు. కొంత భాగం అసైన్డ్ భూముల్లో పోయిందని తెలిపారు. భూమికి బదులు భూమి ఇస్తామన్నామన్నారు. కార్మికుల కోసం షెడ్లు వేస్తే 66 ఎకరాలు కబ్జా చేసినట్లు నివేదిక ఇచ్చారని చెప్పారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థతో విచారణ జరపాలని కోరారు. కలెక్టర్ నివేదిక తమకు అందలేదని.. తమ వివరణ కూడా అడగలేదన్నారు. వ్యక్తులు ఉంటారు పోతారు.. పార్టీలు ఉంటాయి పోతాయి.. వ్యవస్థలు మాత్రం శాశ్వతమని వ్యాఖ్యానించారు.

ఇదేనా మీ సంస్కృతి?

ప్రభుత్వం నుంచి ఐదు పైసలు సాయం తీసుకోలేదు.. ఐదు కుంటల భూమి పొందలేదు.. పౌల్ట్రీకి నాలా అవసరం లేదు.. దానిపై కూడా నోటీసు ఇచ్చారు. కేసీఆర్ గారు ఇదేనా మీ సంస్కృతి?.. మీరు వెయ్యేళ్లు ఉంటారా?: అరెస్టులకు.. కేసులకు ఈటల భయపడే వ్యక్తి కాదు. నా ఇంటి చుట్టూ వందల మంది పోలీసులను పెట్టారు. ఎంత పెద్ద కేసులైనా పెట్టండి.. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా. మీ శిష్యరికంలో నేర్చుకున్న ప్రజలనే నమ్ముకుంటాను. అసైన్డ్ భూముల్లో కంపెనీలు రోడ్లు వేయలేదా?. మీకు వ్యవసాయ క్షేత్రం ఉంది.. అందులో రోడ్లు వేయలేదా? ప్రలోభపెట్టి కొందరితో మాట్లాడించారు.. స్వయంగా సర్పంచ్ మాట మార్చారు. మీ నిజాయితీ, ధర్మానికి ఇదే నిదర్శనం. -ఈటల రాజేందర్

నా కోసం వాళ్లను ఇబ్బంది పెట్టొద్దు

దేవరయాంజల్ భూముల విషయంలో ఆనాడు వైఎస్‌తో సవాల్ చేశానని ఈటల గుర్తు చేశారు. అక్రమాలు జరిగితే చర్యలు తీసుకోవాలని వైఎస్‌కు సవాల్ చేసినట్లు తెలిపారు. తన కోసం దేవరయాంజల్ ప్రజలను ఇబ్బందులు పెట్టొద్దని కోరారు.

ఇవీ చూడండి:

1. నీ అరెస్టులకు.. కేసులకు భయపడే వ్యక్తిని కాదు: ఈటల

2. చావునైనా భరిస్తా... ఆత్మగౌరవం కోల్పోను: ఈటల రాజేందర్

Last Updated : May 3, 2021, 3:08 PM IST

ABOUT THE AUTHOR

...view details