కేరళలో వరద బాధితుల కోసం రామోజీ గ్రూపు నిర్మించిన ఇళ్లను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఈనాడు ఎండీ కిరణ్ లబ్ధిదారులకు అందజేశారు. ఎక్కడ విపత్తులు వచ్చినా ఆదుకునేందుకు తమ సంస్థ సిద్ధంగా ఉంటుందని కిరణ్ చెప్పారు. తెలుగు ప్రజలు ఈ దిశగా తమకు సహకారం అందిస్తున్నారని ప్రశంసించారు. తమ సాయంలో సంస్థ ఉద్యోగుల భాగస్వామ్యమూ ఉందన్నారు. ఇంత అందమైన ఇళ్లను నిర్మించిన 'కుటుంబ శ్రీ' సంస్థ కృషిని కిరణ్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషించిన యువ ఐఎఎస్ కృష్ణతేజకు ధన్యవాదాలు తెలిపారు.
తెలుగు ప్రజల అండతో ఇదంతా చేశాం:ఈనాడు ఎండీ కిరణ్ - కేరళ వరద బాధితులకు ఈనాడు సాయం వార్తలు
కేరళ వరదల్లో సర్వస్వం కోల్పోయిన వారికి అండగా నిలిచిన తెలుగు ప్రజలకు ఈనాడు ఎండీ కిరణ్ ధన్యవాదాలు తెలిపారు. రామోజీ గ్రూపు ఆధ్వర్యంలో వరద బాధితుల కోసం నిర్మించిన ఇళ్లను కేరళ సీఎం విజయన్‌తో కలిసి లబ్ధిదారులకు అందించారు.
ఈనాడు ఎండీ కిరణ్
TAGGED:
kerala floods 2018