లాక్‌డౌన్ వేళ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు 'ఈనాడు-ఈటీవీ భారత్' దృష్టికి తీసుకొచ్చారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో వాటి పరిష్కారం కావడం వల్ల కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ రామంతాపూర్‌లోని నెహ్రూనగర్, శ్రీనగర్ కాలనీలో రోడ్డుపై మ్యాన్‌హోల్స్‌ను శుభ్రం చేసి మట్టిని అలాగే రోడ్డుపై నిల్వ చేశారని, దీంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని "ఈనాడు-ఈటీవీ భారత్" దృష్టికి కాలనీవాసులు తీసుకొచ్చారు. అలాగే కేసీఆర్‌నగర్ కాలనీలో రాత్రి వేళ దోమల బెడత తీవ్రంగా ఉందని ఆ కాలనీవాసులు తెలిపారు. విషయాన్ని కార్పొరేటర్ గంధం జ్యోత్స్న దృష్టికి తీసుకెళ్లగా ఆమె స్పందించారు. ఆయా కాలనీలలో పర్యటించారు. ప్రతి ఇంటి ముందు దోమల నివారణ కోసం పొగ మందు వేయించారు. మట్టి కుప్పలను సిబ్బందితో శుభ్రం చేయించారు.
ఈనాడు-ఈటీవీ భారత్ చొరవతో సమస్యలు పరిష్కారం - ఈనాడు
ఈనాడు-ఈటీవీ భారత్ చొరవతో హైదరాబాద్ రామంతాపూర్‌లోని పలు కాలనీల్లో సమస్యలు పరిష్కారమయ్యాయి. కాలనీవాసులు తమ సమస్యలను ఈనాడు-ఈటీవీ భారత్ దృష్టికి తీసుకురాగా.. కార్పొరేటర్ జ్యోత్స్న దృష్టికి తీసుకెళ్లారు. ఆమె కాలనీల్లో పర్యటించి సమస్యలను పరిష్కరించారు.

ఈనాడు-ఈటీవీ భారత్ చొరవతో సమస్యలు పరిష్కారం