ముఖ్యమంత్రి సహాయనిధికి పలువురు విరాళాలు అందించారు. హార్ట్ ఫుల్నెస్ ఇనిస్టిట్యూట్స్ కోటిన్నర రూపాయల విరాళాన్ని అందించింది. చెక్కును కమలేష్ పటేల్ తరపున సంస్థ సంయుక్త కార్యదర్శి వంశీ చల్లగుల్ల ముఖ్యమంత్రి కేసీఆర్కు అందించారు. మంత్రి కేటీఆర్కు పలువురు చెక్కులు అందించారు. 13 మంది సుమారు కోటి 15 లక్షల రూపాయల విరాళాలను అందించారు. ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ 30 లక్షలు, పీపుల్ టెక్ ఐటీ కన్సల్టెన్సీ 25 లక్షలు, చిరిపాల్ పాలీ ఫిల్మ్స్ 25 లక్షల రూపాయలను మంత్రి కేటీఆర్కు అందించింది.
సీఎంఆర్ఎఫ్కు హార్ట్ఫుల్నెస్ సంస్థ కోటిన్నర విరాళం
ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు వెల్లువెత్తాయి. హార్ట్ ఫుల్నెస్ ఇనిస్టిట్యూట్స్ సంస్థ తరఫున కోటిన్నర రూపాయల చెక్కును సంస్థ సంయుక్త కార్యదర్శి వంశీ ముఖ్యమంత్రి కేసీఆర్కు అందజేశారు.
సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ