తెలంగాణ

telangana

ETV Bharat / state

Agriculture Report: రబీలో తగ్గిన వరి సాగు.. సాధారణ విస్తీర్ణంలో 18 శాతంలోనే నాట్లు

Department of Agriculture Report 2021:రాబోయే యాసంగి ధాన్యం పంట సేకరించబోమని ఎఫ్‌సీఐ రాష్ట్రానికి లేఖ రాయడంతో... ఇక ఈ రబీ నుంచి వరి సాగు వద్దని ప్రభుత్వం రైతులకు తెలిపింది. ఈ నేపథ్యంలో రబీ సీజన్​లో ఇప్పటి వరకు వరిసాగు గణనీయంగా తగ్గింది. సాధారణ విస్తీర్ణంలో 18 శాతంలోనే నాట్లు పడ్డాయని అధికారులు తెలిపారు.

Agriculture Report, Department of Agriculture Report 2021,
వరి సాగు

By

Published : Dec 16, 2021, 6:58 AM IST

Department of Agriculture Report 2021: ప్రస్తుత యాసంగి(రబీ) సీజన్‌లో ఇప్పటివరకూ వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ఈ సీజన్‌లో ఇప్పటికి సాధారణ విస్తీర్ణం 70,188 ఎకరాల్లో నాట్లు వేయాలి. కానీ, అందులో 18.77 శాతం(13,180 ఎకరాల్లో) మాత్రమే నాట్లు పడ్డాయని వ్యవసాయ శాఖ బుధవారం ప్రభుత్వానికిచ్చిన నివేదికలో పేర్కొంది.

గతేడాది ఇదే సమయానికి 37,333 ఎకరాల్లో నాట్లు వేశారు. వరి సాగు చేయవద్దని రైతులకు ప్రభుత్వం పలుమార్లు సూచించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న సాగు పెరుగుతుందని వ్యవసాయ శాఖ తొలుత అంచనా వేసినా.. అదీ పెద్దగా లేదు. మొక్కజొన్న ఇప్పటికి లక్షా 51 వేల ఎకరాల్లో సాగు కావాలి. అంతకన్నా 36 వేల ఎకరాలు తగ్గింది. వీటి తరవాత ప్రధాన పంటలైన శనగ, వేరుసెనగ సాగు స్వల్పంగా పెరిగాయి. అన్ని రకాల పంటలూ కలిపి ఇప్పటికి 8.81 లక్షల ఎకరాల్లో వేయాల్సి ఉండగా.. అంతకన్నా 12 వేల ఎకరాలు అదనంగా సాగైంది. గతేడాది ఈ సమయానికి 6.15 లక్షల ఎకరాలే సాగవగా.. ఈసారి 8.93 లక్షల ఎకరాలకు పెరిగింది.

ఇదీ చూడండి:Crop Loans: తగ్గిన పంట రుణాలు... వరి వద్దని చెప్పడమే కారణమంటున్న బ్యాంకర్లు

ABOUT THE AUTHOR

...view details