తెలంగాణ

telangana

ETV Bharat / state

'అధికారంలోకి వస్తే.. మున్సిపల్ టాక్స్ రద్దు' - మున్సిపల్ విజన్ వెల్లడించిన శ్రవణ్

రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మున్సిపాలిటీలను స్థానిక ప్రభుత్వాలుగా గుర్తించనున్నట్లు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ వెల్లడించారు.

congress party municipal vision
కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ విజన్

By

Published : Jan 16, 2020, 5:28 PM IST

భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 500 చదరపు అడుగుల ఇంటికి మున్సిపల్ టాక్స్ రద్దు చేస్తామని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్‌ పేర్కొన్నారు. మున్సిపాలిటీలను స్థానిక ప్రభుత్వాలుగా గుర్తించనున్నట్లు తెలిపారు. గాంధీభవన్‌లో ఆయన మున్సిపల్ ఎన్నికల విజన్ డాక్యుమెంట్​లోని అంశాలను వివరించారు.

పేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ.6లక్షలు

తెల్లరేషన్ కార్డు ఉన్న వారందరికీ.. ఉచిత నల్లా కనెక్షన్లు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. ప్రతి మున్సిపాలిటీలో రోడ్లు, ఇంకుడు గుంతలు, ఇండోర్ స్టేడియం, జీమ్‌, వృత్తి నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పురపాలికలో పేదలకు రూ. 5కే భోజనం పెడతామన్నారు. పేదవారికి 100 గజాల ఇంటి స్థలంతో పాటు నిర్మాణం కోసం రూ. 6 లక్షలు ఇవ్వనున్నట్లు దాసోజు వివరించారు.

కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ విజన్

ఇవీచూడండి: తెరాస 'పుర' అభ్యర్థులతో మంత్రి కేటీఆర్​ టెలీకాన్ఫరెన్స్

ABOUT THE AUTHOR

...view details