హైదరాబాద్ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ప్రగతి నగర్లోని మిథిలా నగర్ కాలనీలో గత నెల 25 నుంచి నిత్యం అన్నార్తులకు మద్దు సురేష్ అనే వ్యక్తి భోజనం అందిస్తున్నాడు. నెలరోజులుగా నిత్యం ఉదయం, సాయంత్రం కలిసి మొత్తం 800 మందికి భోజన సౌకర్యాన్ని కల్పిస్తున్నాడు. వివిధ రాష్ట్రాల నుంచి నగరానికి పొట్టకూటి కోసం వచ్చిన కూలీలకు భోజనం వడ్డిస్తూ అందరి మన్ననలను పొందుతున్నాడు. ఒక వ్యక్తి సహాయం చేయాలనుకుంటే ఎందరికైనా సహాయం చేయవచ్చని నిరూపిస్తున్నాడు.
పొట్టకూటి కోసం వచ్చిన కూలీలకు భోజన సదుపాయం - daily food distribution in hyderabad
హైదరాబాద్ ప్రగతినగర్ మిథిలానగర్ కాలనీలో మద్దు సురేష్ అనే వ్యక్తి 800 మందికి భోజనం అందిస్తున్నాడు. పొట్టకూటి కోసం వచ్చిన కూలీలకు భోజనం వడ్డిస్తూ అందరి మన్ననలను పొందుతున్నాడు.
పొట్టకూటి కోసం వచ్చిన కూలీలకు భోజన సదుపాయం