తెలంగాణ

telangana

ETV Bharat / state

'అక్కడ కుళ్లిన, కొవిడ్ మృతదేహాలను ఇక్కడ ఖననం చేస్తున్నారు'

అంబర్​పేట విద్యుత్​ స్మశానవాటికను తిరిగి ప్రారంభించి ప్రభుత్వం వేల మంది ప్రాణాలతో చెలగాటమాడుతోందని సీపీఎం నేతలు ఆరోపించారు. స్మశాన వాటికను తిరిగి ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ అంబర్​పేటలో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ ఆందోళనకు తెరాస, ఎంఐఎం మద్దతు తెలిపాయి.

By

Published : Jul 9, 2020, 5:59 PM IST

Updated : Jul 9, 2020, 7:23 PM IST

cpm leaders protest to close down cemetry at amberpet in hyderabad
స్మశానవాటికను మూసేయాలని సీపీఎం ఆధ్వర్యంలో నిరసన

హైదరాబాద్​లోని అంబర్​పేట్ విద్యుత్ స్మశానవాటికని తిరిగి ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. విద్యుత్ స్మశానవాటికను తిరిగి ప్రారంభించి సుమారు 50వేల మంది ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని సీపీఎం నేత మహేందర్​ అన్నారు.

గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల నుంచి కుళ్లిన మృతదేహాలను రాత్రిపూట దహనం చేయడం వల్ల దాని నుంచి వచ్చే వాయువులను పీల్చిన ప్రజలు క్యాన్సర్, కాలేయ, శ్యాస సంబంధమైన సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రుల్లో చేరుతున్నారని వెల్లడించారు.

గతంలో ఇదే స్మశాన వాటిక మూతపడటానికి అనేక పోరాటాలు చేశామన్నారు. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి, మాజీ గవర్నర్ తివారీకి మెమోరాండం ఇచ్చామని తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తిని అడ్డుకొని రాస్తారోకో చేశామన్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా కరోనా వ్యాధితో చనిపోయిన వారి మృతదేహాలను రాత్రి పూట దహనం చేస్తున్నారని... చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని వెల్లడించారు.

అంబర్​పేట స్మశానవాటికను మూసివేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు కబీర్, ఎంఐఎం నాయకులు అలీ, రమేష్, రాజు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: అంతరిక్ష రంగాన్ని సైతం ప్రైవేటీకరించడం ప్రమాదకరం: సీపీఐ

Last Updated : Jul 9, 2020, 7:23 PM IST

ABOUT THE AUTHOR

...view details