భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లాను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తన కార్యాలయానికి పిలిపించుకోవడం పట్ల సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రావీణ్యత పొందిన శాస్త్రవేత్త అనేక వ్యాక్సిన్లను తయారు చేసి... 70 దేశాలకు సరఫరా చేస్తున్నారని కొనియాడారు.
ఇదేనా శాస్త్రవేత్తలకు ఇచ్చే గౌరవం: సీపీఐ నారాయణ
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లాను తన కార్యాలయానికి పిలిపించుకోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.
కరోనాకు వ్యాక్సిన్ తయారు చేయడాన్ని సవాల్‌గా తీసుకుని మరోసారి ప్రపంచ కొవిడ్ బాధితులకు అండగా నిలబడ్డారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అపత్కాలంలో సహాయం అడగడానికి భారత్ బయోటెక్ ఉన్న తుర్కపల్లికి వెళ్లాల్సిన సోమేశ్‌కుమార్ క్షణం తీరిక లేకుండా గడిపే కృష్ణ ఎల్లాను తన కార్యాలయానికి పిలిపించుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇదేనా శాస్త్రవేత్తలకు ఇచ్చే గౌరవమని ప్రశ్నించారు. గతంలో ప్రధానకార్యదర్శులకు ప్రత్యేక, పవిత్ర స్థానం ఉండేదని.. ఇప్పుడు ముఖ్యమంత్రులకు పనిమనుషులుగా మారిపోయారని చెప్పడానికి విచారపడుతున్నానన్నారు.
ఇదీ చూడండి :వ్యాక్సిన్ వేసుకోవాలని సీఎం ఎందుకు చెప్పటం లేదు: బండి సంజయ్