హైదరాబాద్ రాయదుర్గం చోరీ కేసులో నేపాల్ ముఠాను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశామని పేర్కొన్నారు. నిందితుల నుంచి రూ.5.20 లక్షలు, బంగారం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మరో ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నారని అన్నారు.
బోర్‌వెల్ వ్యాపారి మధుసూదన్‌రెడ్డి ఇంట్లో నేపాల్ ముఠా పని మనుషులుగా చేరారని తెలిపారు. యజమానులతో నమ్మకంగా ఉంటూ చోరీకి పాల్పడ్డారని వివరించారు. ముఠాలో ప్రధాన నిందితుడు నేపాల్‌కు చెందిన నేత్రగా గుర్తించినట్లు ప్రకటించారు. ఈ గ్యాంగ్ ఆహార పదార్థాల్లో మత్తుమందు కలిపి చోరీలకు పాల్పడుతున్నారని స్పష్టం చేశారు.