తెలంగాణ

telangana

ETV Bharat / state

CP CV Anand on Arms License Holders : పోలీసు శాఖ కీలక ఆదేశాలు.. లైసెన్స్ తుపాకీలను ఠాణాలో డిపాజిట్ చేయాలని ఉత్తర్వులు

CP CV Anand on Arms License Holders : రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగిన వేళ పోలీస్​ శాఖ కీలక సూచనలు చేసింది. లైసెన్స్ తుపాకీలు కలిగి ఉన్న వారు ఆ గన్స్​​ను పోలీస్ ​శాఖ వద్ద డిపాజిట్ చేయాలని సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులను జారీ చేశారు. డిసెంబర్ 10వ తేదీ తర్వాత మళ్లీ తిరిగి తీసుకోవచ్చని తెలిపారు.

Telangana election latest information
CP CV Anand Issued key Orders To politicians

By ETV Bharat Telangana Team

Published : Oct 10, 2023, 3:16 PM IST

Updated : Oct 11, 2023, 8:49 AM IST

CP CV Anand on Arms License Holders :రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగిన వేళ పోలీస్ ​శాఖ అప్రమత్తమైంది. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో లైసెన్స్ తుపాకులను ఈ నెల 16వ తేదీలోపు స్థానిక పోలీస్ స్టేషన్​లో డిపాజిట్ చేయాలని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం డిసెంబర్ 10వ తేదీన వాటిని తిరిగి తీసుకోవచ్చని తెలిపారు. జాతీయ బ్యాంకుల్లో పనిచేసే గార్డులకు, పబ్లిక్ సెక్టార్​లో విధులు నిర్వర్తించే సెక్యూరిటీ సిబ్బందికి మాత్రం మినహాయింపు నిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పడు లైసెన్స్ ఉన్న తుపాకీలను స్థానిక పోలీస్ స్టేషన్​కు డిపాజిట్ చేయాల్సి ఉంటుందని సీవీ ఆనంద్ తెలిపారు.

EC On Telangana Elections 2023 :మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎస్ఈసీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఈసీ సన్నాహాలు చేస్తోంది. వివిధ పార్టీలతో ఇప్పటికే సమావేశమైనఎన్నికల ప్రధానాధికారి వారికి పలు సూచనలు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీల, నేతల పోస్టర్లను అధికారులు తొలగిస్తున్నారు. ప్రభుత్వం ఎటువంటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడానికి అవకాశం లేదని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

CEO Vikas Raj on Telangana Elections 2023 : 'రాష్ట్రంలో ఎలక్షన్​ కోడ్​ అమలు.. అభ్యర్థులు అవి తెలపకపోతే నామినేషన్ల తిరస్కరణే'

5 States Election Date 2023 : 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్.. ఫలితాలు ఎప్పుడంటే?

సోమవారమే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్రఎన్నికల సంఘం కీలక నోటిఫికేషన్ జారీ చేయడం వల్ల అప్పటినుంచే రాష్ట్రంలో ఎన్నికలకోడ్ అమల్లోకి వచ్చింది. నగరంలో ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు ఇప్పటికే ఎన్నికల అధికారులు తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. వాహనాల్లో తీసుకువెళ్తున్న బంగారాన్ని, ధనాన్ని తాజాగా పలుచోట్ల అధికారులు సీజ్ చేస్తున్నారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నంతవరకు అధికమొత్తంలో డబ్బును, బంగారం కార్లలో తరలించడం వంటివి ఎన్నికల నియమావళిప్రకారం శిక్షార్హమైన నేరమని తెలిపారు. విద్యార్థుల ఫీజులు, వివాహం వంటి సందర్భాలలో సరైన పత్రాలు చూపిస్తే వారి నగదును తిరిగి ఇచ్చే అవకాశం ఉందన్నారు. రూ.50 వేలకు మించి నగదును తరలించాల్సి వస్తే వాటికి తగిన పత్రాలను పత్రాలను అధికారులకు చూపించాల్సి ఉంటుందని వెల్లడించారు.

రాష్ట్రంలో ఈ నెల 30న ఎన్నికలు జరగనున్న వేళ ఎన్నికలలో ధన ప్రవాహాన్ని నివారించేందుకు ఈసీ ప్రయత్నిస్తోంది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా.. అధికారయంత్రాగాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. నోటిఫికేషన్ విడుదల కావడంతో రాజకీయపార్టీలు ప్రచార వేగాన్ని ముమ్మరం చేశాయి.

CWC Meeting Today : 'ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. పక్కా వ్యూహం అవసరం.. క్రమశిక్షణతో పనిచేయాలి'

Telangana Congress MLA Candidates List Delay : గెలుపు గుర్రాల ఎంపికపై నత్తనడకన కాంగ్రెస్.. ఇప్పటికైనా వేగం పెంచి కారుని అధిగమిస్తుందా..?

Last Updated : Oct 11, 2023, 8:49 AM IST

ABOUT THE AUTHOR

...view details