గాంధీ ఆస్పత్రిలో ఈ రోజు నుంచి కరోన నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. గాంధీ వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన వైరాలజీ ల్యాబ్‌ను ఆయన ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో కరోనా వైరస్ గురించి ఆందోళన నెలకొందని.. దాన్ని ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. గత 10రోజులుగా టెస్ట్‌లు పుణెకు పంపించారని.. ఇవాళ్టి నుంచి గాంధీలోనే పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కొన్ని గంటల్లోనే ఫలితాలు అందుతాయని మంత్రి వెల్లడించారు.
గాంధీలో కరోన నిర్ధారణ పరీక్షలు.. కొన్ని గంటల్లోనే ఫలితం వ్యాధి నిర్ధారణ కోసం
కేంద్రం ప్రత్యేక కిట్స్ పంపిందని.. ల్యాబ్‌లో కిట్స్, సిబ్బంది అన్ని అందుబాటులో ఉన్నాయని ఈటల వెల్లడించారు. ఫీవర్, చెస్ట్, గాంధీ ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డ్స్ ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక కరోనా కేసు నమోదు కాలేదని స్పష్టం చేశారు.
గాంధీ ఆస్పత్రిలో కరోన సౌకర్యాలు
- 24 గంటలు అందుబాటులో వైద్యులు
- కరోన వైరస్ ఇంకుబేషన్ పీరియడ్ 14 రోజులు
- చైనా నుంచి వచ్చిన వారికి 14 రోజుల అబ్జర్వేషన్
- రెండు తెలుగు రాష్ట్రాలకు గాంధీ ఆస్పత్రిలోనే కరోన పరీక్షలు
ఇవీ చూడండి: సూక్ష్మ పోషకాల వినియోగంపై అవగాహన సదస్సు