జిల్లాల వారీగా కొత్త కేసులు
ఏపీలో కొత్తగా 71 కరోనా పాజిటివ్ కేసులు
ఏపీలో కొత్తగా 71 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్త కేసులతో కలిపి... కరోనా సోకిన వారి సంఖ్య 1,403కు చేరిందని హెల్త్ బులెటిన్లో ప్రకటించింది. 321 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారని తెలిపింది. 1,051 మంది కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో 6497 నమూనాలు సేకరించి కరోనా పరీక్షలు చేయగా 71 మందికి పాజిటివ్ వచ్చిందని తెలిపింది.
ఏపీలో కొత్తగా 71 కరోనా పాజిటివ్ కేసులు
కర్నూలు జిల్లాలో 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, కృష్ణా జిల్లాలో 10, గుంటూరులో 4, కడప జిల్లాలో 4, అనంతపురంలో 3, చిత్తూరులో 3, నెల్లూరులో 2, తూర్పుగోదావరి జిల్లాలో 2 కరోనా కేసులు నమోదయ్యాయి.