తెలంగాణ

telangana

ETV Bharat / state

CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 245 కరోనా​ కేసులు.. ఒకరు మృతి - telangana varthalu

రాష్ట్రంలో 24 గంటల్లో 50,126 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 245 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్​ వైరస్​ బారినపడి మరొకరు ప్రాణాలు కోల్పోయారు.

CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 245 కరోనా​ కేసులు.. ఒకరు మృతి
CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 245 కరోనా​ కేసులు.. ఒకరు మృతి

By

Published : Aug 15, 2021, 7:36 PM IST

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 50,126 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 245 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 6,52,380కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,842కి చేరింది.

ఒక్కరోజు వ్యవధిలో 582 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,41,270కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 7,268 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇదీ చదవండి: CM KCR: దళితబంధు ఓ పథకం కాదు.. ఉద్యమం: కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details