Telangana Corona Cases: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత నెలలో నిత్యం మూడు వేలకుపైగా వచ్చిన కేసులు అంతకంతకూ తగ్గుతున్నట్టు ఆరోగ్య శాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో 2,387 కరోనా పాజిటివ్ కేసులు.. ఒక మరణం నమోదైంది. కరోనా నుంచి 4,559 మంది కోలుకుని డిశ్చారయ్యారని తెలంగాణ వైద్యారోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,74,215కు చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 4,097 మంది మృతి చెందారు. కరోనా నుంచి 7,39,187 మంది కోలుకోగా.. రాష్ట్రవ్యాప్తంగా 30,951 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఒక్క రోజులో 79,561 నమూనాలను వైద్య శాఖ పరీక్షించింది.
హైదరాబాద్‌లో 688 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మేడ్చల్, సిరిసిల్ల జిల్లాల్లో 131 చొప్పున కేసులు బయటపడ్డాయి. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్పంగా 10 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 5,49,94,699 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది.