Telangana Corona: రాష్ట్రంలో కొవిడ్ ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 73,156 పరీక్షలు నిర్వహించగా... 2,606 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,92,357కి చేరింది. వైరస్ బారిన పడి ఇద్దరు చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 4,041కి చేరింది.
Telangana Corona: రాష్ట్రంలో కరోనా విజృంభణ... కొత్తగా 2,606 కేసులు - corona virus latest news
19:49 January 08
రాష్ట్రంలో కరోనా విజృంభణ
కరోనా నుంచి 285 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12,180 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,583 కేసులు వచ్చినట్లు ప్రకటించింది.
క్రమంగా పెరుగుతున్న కేసులు...
రాష్ట్రంలో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నెల 2న 274 కరోనా కేసులు నమోదు కాగా... 3న 482, 4న 1,052, 5న 1,520, 6న 1,913, 7న 2,295, ఇవాళ 2,606 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కరోనా ఉద్ధృతి పెరుగుతుండటంతో ప్రతి ఒక్కరు భౌతికదూరం పాటిస్తూ మాస్క్ ధరించాలని అధికారులు సూచించారు.
ఇదీ చదవండి: