తెలంగాణ

telangana

ETV Bharat / state

గాంధీభవన్​లో కాంగ్రెస్​ ముఖ్యనేతల సమావేశం - congress senior leaders meet in Hyderabad

హైదరాబాద్​ గాంధీభవన్​లో కాంగ్రెస్​ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. రేపటి నుంచి 27 వరకు చేపట్టబోయే నిరసనలు, ఆందోళనలపై చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై పార్టీ చేపడుతున్న కార్యక్రమాలల్లో అందరూ పాల్గొనాలని ఉత్తమ్ సూచించారు.

congress senior leaders meet in Hyderabad
గాంధీభవన్​లో కాంగ్రెస్​ ముఖ్యనేతల సమావేశం

By

Published : Dec 20, 2019, 6:06 PM IST

Updated : Dec 20, 2019, 7:52 PM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్​ సిద్ధమైంది. రేపటి నుంచి 27 వరకు చేపట్టబోయే నిరసనలు, ఆందోళనలపై చర్చించేందుకు ఆ పార్టీ ముఖ్యనేతలు హైదరాబాద్​ గాంధీభవన్​లో సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ ఆర్సీ కుంతియా, పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కీ, కుసుమ కుమార్, పీసీసీ ప్రధాన కార్యదర్శులు ,అధికార ప్రతినిధులు, నియోజకవర్గ ఇంఛార్జీలు పాల్గొన్నారు.

ఆవిర్భావ దినోత్సవం నాడు భారీ ర్యాలీ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై నిర్వహించనున్న పార్టీ కార్యక్రమాల్లో కార్యకర్తలు పాల్గొనాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు. ఈనెల 28న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురష్కరించుకుని చేపట్టనున్న భారీ ర్యాలీకి కార్యకర్తలు తరలిరావాలన్నారు.

అందరూ పాల్గొనాలి: ఉత్తమ్

గాంధీభవన్​లో ప్రారంభమైన ర్యాలీ.. అబిడ్స్‌ నెహ్రు విగ్రహం మీదుగా ట్యాంక్‌ బండ్‌ అంబేడ్కర్‌ విగ్రహం వరకు కొనసాగుతుందన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు నిర్వహించే కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని కుంతియా స్పష్టం చేశారు.

గాంధీభవన్​లో కాంగ్రెస్​ ముఖ్యనేతల సమావేశం

ఇవీ చూడండి: భాగ్యనగరానికి రాష్ట్రపతి కోవింద్.. ఘన స్వాగతం

Last Updated : Dec 20, 2019, 7:52 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details