మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాలుగు మున్సిపాలిటీలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పార్లమెంటు ఎన్నికల కంటే ఓట్ల శాతం పెరిగినట్లు హస్తం పార్టీ అంచనా వేస్తోంది. 2,616 స్థానాల్లో పోటీ చేసి.. 580 స్థానాలు దక్కించుకుని... 31 శాతానికిపైగా ఓట్లు వచ్చినట్లు లెక్కలు కడుతున్నారు. అధిక స్థానాలు వచ్చిన చోట్ల కూడా ఎక్స్ అఫిషియో సభ్యులను వాడుకుని అధికార తెరాస... ఛైర్మన్ పదవులను ఎగురేసుకుని పోయింది.
31శాతానికిపైగా ఓట్లు వచ్చినట్లు లెక్కలు
డబ్బు, మద్యం విచ్చలవిడిగా ఖర్చు చేయటంతో పాటు అధికార దుర్వినియోగానికి పాల్పడి మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతానికిపైగా పురపాలికలను తెరాస కైవసం చేసుకుందని ఆరోపిస్తున్న కాంగ్రెస్.. పార్టీ అంతర్గత లోపాలపై కూడా ఆరా తీస్తోంది. సగటున 31శాతానికిపైగా ఓట్లు వచ్చినట్లు లెక్కలు వేస్తున్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి... మున్సిపాలిటీల వారీగా ఓట్ల శాతాన్ని తెప్పించుకుంటున్నారు. మొత్తం 120 మున్సిపాలిటీలు, పది నగరపాలక సంస్థల నుంచి వార్డుల వారీగా, డివిజన్ల వారీగా ఓట్ల శాతంపై ఆరా తీస్తున్నారు.
అంతర్గత విబేధాలు