పీసీసీ అధ్యక్షుడి ఎంపికలో మేధోమదనం జరగాలని కాంగ్రెస్ అధిష్ఠానానికి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ హనుమంతరావు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అధిక జనాభా ఉన్న బీసీలకే అవకాశం కల్పించాలన్నారు. ప్రభుత్వంపై యుద్దం ప్రకటిస్తేనే ప్రజలు కాంగ్రెస్ వైపు వస్తారన్న ఆయన... అందివచ్చిన ఏ అవకాశాన్ని కాంగ్రెస్ అందిపుచ్చుకోలేదని అన్నారు. కేసీఆర్ సామాజిక వర్గం ఒక శాతమే ఉన్నా... అందరినీ కలుపుకుని వెళ్తున్నారని కితాబిచ్చారు.
పీసీసీ రేసులో నేనున్నా: వీహెచ్ - congress leader v.hanumantha rao
తెలంగాణలో అధిక జనాభా ఉన్న బీసీలకే పీసీసీగా అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా అధిష్ఠానం మేల్కొని ఓటు బ్యాంకు రాజకీయం చేయాలని సూచించారు.

'పీసీసీ అధ్యక్షుడి ఎంపికలో మేధోమదనం జరగాలి'
అసెంబ్లీ, పార్లమెంటు, మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలు అన్నింటిలోనూ కాంగ్రెస్ పార్టీ ఓడిందన్నారు. గత చరిత్ర చూస్తే బీసీలకు పీసీసీ అవకాశం ఇచ్చినప్పుడే పార్టీ అధికారంలోకి వచ్చిందన్న ఆయన... తాను కూడా పీసీసీ కావాలని ఆశిస్తున్నట్లు స్పష్టం చేశారు.
'పీసీసీ అధ్యక్షుడి ఎంపికలో మేధోమదనం జరగాలి'
ఇవీ చూడండి: 'ఈ ఫలితం... కేసీఆర్ సర్కార్ పనితీరుకు అద్దం పడుతోంది'