రాష్ట్రంలో పనిచేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలని ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అలాగే తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను పునర్నియమించాలన్నారు. ప్రతి గ్రామంలో దాదాపు 50రకాల విధులు నిర్వహిస్తూ ఉదయం 7 నుంచి రాత్రి 8గంటల వరకు పనిచేస్తూ పంచాయతీ కార్యదర్శులు తీవ్రమైన పని ఒత్తిడికి లోనవుతున్నారని పేర్కొన్నారు.
'జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించాలి' - పంచాయతీ కార్యదర్శి
జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు పనికి తగ్గ వేతనం అందించాలని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను పునర్నియమించాలని అన్నారు.
'జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించాలి'
ఈ చాలీ చాలని జీతంతో కుటుంబ పోషణ ఇబ్బందిగా ఉంటే, వచ్చే అరకొర జీతం కూడా 3-4 నెలలకొకసారి ఇవ్వడం భావ్యం కాదని, ఇలాంటి చర్యలవల్ల ఇది ఉద్యోగస్తుల వ్యతిరేక ప్రభుత్వమని నిరూపితమైతుందని ఆయన అన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు పనికి తగ్గ వేతనం అందించాలని, వారికి వచ్చే జీతం, ప్రతీ నెల ప్రభుత్వ ట్రెజరీ నుంచి అందించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: 'మొదటి రోజు పీవీ ప్రసంగాలను ప్రసారం చేస్తాం'