తెలంగాణ

telangana

ETV Bharat / state

మరింత వేగంగా గమ్యం చేరొచ్చు - పీవీ ఎక్స్​ప్రెస్ వే

ప్రజలను ట్రాఫిక్ చిక్కుల నుంచి తప్పించేందుకు ప్రభుత్వం పై వంతెనలు, అండర్​ గ్రౌండ్ పాస్​లు నిర్మిస్తున్నారు. మెహిదీపట్నం, రేతిబౌలి వద్ద ట్రాఫిక్ ఒత్తిడి తగ్గేలా పీవీ ఎక్స్​ప్రెస్ వేలో 166 నుంచి 155 నెంబర్ పిల్లర్ వరకు చేపట్టిన ర్యాంపు నిర్మాణాన్ని పూర్తి చేశారు.

complete-ramp-on-one-side-of-pv-expressway
మరింత వేగంగా గమ్యం చేరొచ్చు

By

Published : Mar 29, 2021, 10:06 AM IST

హైదర్‌గూడ, ఉప్పరిపల్లి వాసులకు మెహిదీపట్నం, రేతిబౌలి ట్రాఫిక్‌ చిక్కుల నుంచి విముక్తి కలిగింది. పీవీ ఎక్స్‌ప్రెస్‌ వేలో 166 నుంచి 155 నెంబరు పిల్లర్‌ వరకు కొత్తగా చేపట్టిన ర్యాంపు నిర్మాణం పూర్తయ్యింది. దీనిని అధికారికంగా ప్రారంభించకపోయినా రెండువారాలుగా రాకపోకలకు అనుమతిస్తున్నారు. ఇక్కడే మరోవైపు దిగే ర్యాంపు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రెండు మూడు నెలల్లో ఇవి కూడా పూర్తికానున్నాయని హెచ్‌ఎండీఏ అధికారులు చెబుతున్నారు.

ప్రయోజనమిలా..

మెహిదీపట్నం, రేతిబౌలి వద్ద ట్రాఫిక్‌ ఒత్తిడి తగ్గుతుంది. ఇక్కడ గంటకు రద్దీ వేళల్లో వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. కార్లు పైనుంచి వెళితే కింద ట్రాఫిక్‌ రద్దీ తగ్గుతుంది. ద్విచక్రవాహనదారులు, స్వల్పదూరం వెళ్లేవారికి ఊరటగా ఉంటుంది.

ఇదీ చూడండి:చదువుల తల్లీ.. సీట్లు అనుగ్రహించవేమి!

ABOUT THE AUTHOR

...view details