తెలంగాణ

telangana

ETV Bharat / state

తమ ఔదార్యాన్ని చాటుకుంటున్న కాలనీవాసులు - covid-19 latest news

ప్రార్థించే చేతిల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నట్లుగా కరోనా వ్యాప్తి చెంది లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో రెక్కాడితే గాని డొక్కాడని ఎంతోమంది ఆకలితో అలమటిస్తున్నారు. అలాంటి సమయంలో ఈ కాలనీవాసులు తమ ఔదార్యాన్ని చాటుతున్నారు.

COLONY PEOPLE FOOD DISTRIBUTION I N HYDERABAD
తమ ఔదార్యాన్ని చాటుకుంటున్న కాలనీవాసులు

By

Published : Apr 4, 2020, 7:30 AM IST

కరోనా నియంత్రణ కోసం లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో రోజువారి కూలీలకు పనులు లేకుండా పోయాయి. రెక్కాడితే కానీ డొక్కాడని పేద కూలీల పరిస్థితి రోజు రోజుకు దినదిన గండంగా మారింది. దీంతో వీరికి సహాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కొందరు దాతలు ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా అంబర్‌పేట, పోచమ్మ బస్తీ వాసులతోపాటు యువకులు ముందుకు వచ్చారు.

ప్రతి రోజు 100 మంది నిరుపేద కూలీలకు వారే స్వయంగా వంటలు చేసుకొని..వాటిని ప్యాకెట్ల రూపంలో వారివద్దకే వెళ్లి అందజేస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితిల్లో పోచమ్మబస్తీ వాసులు కడుపునిండా అన్నం పెట్టడంపై రోజువారి కూలీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తమ ఔదార్యాన్ని చాటుకుంటున్న కాలనీవాసులు

ఇవీ చూడండి: ర్యాపిడ్ టెస్టింగ్ కిట్​తో ఇంటివద్దే కరోనా పరీక్షలు

ABOUT THE AUTHOR

...view details