రేపు దిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్.. కార్యాలయం ప్రారంభం - దిల్లీ వెళ్లనున్న కేసీఆర్
08:23 December 11
రేపు దిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్
ఈ నెల 14న దిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పిన సీఎం కేసీఆర్ రేపు దిల్లీ వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ముందుగానే నిన్న మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్లు దిల్లీలో 14వ తేదీకి సంబంధించిన పనులు దగ్గరుండి చూసుకోవడానికి వెళ్లారు. మంత్రులంతా.. ఆయా జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలను తీసుకొని రావాలని సీఎం కేసీఆర్ నిన్న ఆదేశించారు. 14 తర్వాత పార్టీపరంగా జాతీయ అంశాలపై దృష్టి సారిస్తారు. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల పరంగా కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాలను దిల్లీలో ఎండగట్టే విధంగా విధానాలను రూపొందించుకుంటున్నారు. దిల్లీ పర్యటన ముగిసిన తర్వాత శాసనసభ సమావేశాలపై నిర్ణయం తీసుకుందామని మంత్రులతో సీఎం పేర్కొన్నట్లు తెలిసింది.
దేశ రాజకీయ యవనికపై కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. తెలంగాణ సీఎం కేసీఆర్ సారథ్యంలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరు భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్పు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఆవిర్భావానికి సంబంధించి ఈసీ పంపిన లేఖపై 9వ తేదీన కేసీఆర్ సంతకం చేశారు.
ఇవీ చదవండి: