తెలంగాణ

telangana

ETV Bharat / state

పట్టణాలు పచ్చదనంతో కళకళలాడాలి: సీఎం కేసీఆర్​ - cities

హైదరాబాద్ నగరంతోపాటు, ఇతర నగరాలు, పట్టణాలు కాలుష్య కూపాలుగా మారకుండా పర్యావరణ పరిరక్షణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నగరాల లోపల, బయట ఉన్న అటవీ భూముల్లో విరివిగా చెట్లు పెంచాలని సీఎం సూచించారు.

CM KCR SPOKE ON CITY POLLUTION
పట్టణాలు పచ్చదనంతో కళకళలాడాలి: సీఎం కేసీఆర్​

By

Published : Jan 26, 2020, 5:46 PM IST

హైదరాబాద్ లోపల, బయట లక్షా 60 వేల ఎకరాల అటవీ భూమి ఉందని వీటిలో విరివిగా చెట్లు పెంచి దట్టమైన అడవులుగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్​ అధికారులను ఆదేశించారు. దీనివల్ల హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రతలు పెరగకుండా, కాలుష్యం పెరగకుండా చూడవచ్చన్నారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ బడ్జెట్లలో పదిశాతం నిధులను పచ్చదనం పెంచడానికి ఉపయోగించాలన్నారు. ఇతర నగరాలు, పట్టణాల్లో కూడా హరిత ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచిచారు.

అన్ని పట్టణాల్లో కనీసం వార్డుకొకటి చొప్పున నర్సరీలు ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణలోని అన్ని పట్టణాలు పచ్చదనంతో కళకళలాడే విధంగా పట్టణ ప్రగతిలో చర్యలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కోరారు.

పట్టణాలు పచ్చదనంతో కళకళలాడాలి: సీఎం కేసీఆర్​

ఇవీ చూడండి: అనతికాలంలోనే రాష్ట్రంలో అత్యున్నత ఫలితాలు: తమిళిసై

ABOUT THE AUTHOR

...view details