కృష్ణాజలాల అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సాయంత్రం అత్యవసర కీలక సమావేశం నిర్వహించనున్నారు. ప్రగతిభవన్ వేదికగా మంత్రులు, ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రులు భేటీలో పాల్గొననున్నారు.
కృష్ణాజలాల అంశంపై కేసీఆర్ కీలక సమావేశం - కేసీఆర్ కీలక సమావేశం
ప్రగతిభవన్ వేదికగా మంత్రులు, ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కానున్నారు. పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుపై సమీక్షించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన 203 ఉత్తర్వుపై ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. రోజుకు పోతిరెడ్డిపాడు ద్వారా 7, రాయలసీమ ఎత్తిపోతల ద్వారా 3 టీఎంసీల నీటిని తరలించేందుకు ఏపీ సర్కారు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా జగన్ సర్కారు వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో కృష్ణా జలాల అంశంపై మంత్రులు, అధికారులు, ఇంజినీర్లతో ముఖ్యమంత్రి సమావేశమై ఆయా అంశాలపై చర్చించనున్నారు.
ఇవీ చూడండి:కొత్తజంటకు క్వారంటైన్ ముద్ర