తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏ పని చేసినా పూర్తి చిత్తశుద్ధితో చేయాలి: కేసీఆర్​ - cm kcr participated in chaganti sapthaham in Hyderabad

హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ గార్డెన్‌లో చాగంటి కోటేశ్వరరావు భాగవత సప్తాహం ముగింపు కార్యక్రమానికి సీఎం కేసీఆర్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏ పని చేసినా పూర్తి చిత్తశుద్ధితో చేయాలని సూచించారు.

cm kcr participated in chaganti sapthaham in Hyderabad
చాగంటి భాగవత సప్తాహంలో కేసీఆర్​

By

Published : Dec 20, 2019, 7:33 PM IST

Updated : Dec 20, 2019, 9:49 PM IST

భాగవత సప్తాహం వంటి కార్యక్రమాలు అరుదుగా జరుగుతాయని.. వాటిని వినడం మన అదృష్టమన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.​ హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ గార్డెన్‌లో చాగంటి కోటేశ్వరరావు భాగవత సప్తాహం ముగింపు కార్యక్రమానికి సీఎం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఏ పని చేసినా పూర్తి చిత్తశుద్ధితో చేయాలని సూచించారు.

చాగంటి మాటలతో పరోక్ష సంబంధం

చాగంటితో ప్రత్యేక సంబంధం లేకున్నా వారి మాటలతో పరోక్ష సంబంధం ఉందన్నారు ముఖ్యమంత్రి. వారి ప్రవచనంలో అద్భుతమైన విషయాలు చెబుతుంటారని తెలిపారు. ఆయన్ను గౌరవించుకోవడం మనల్ని మనం గౌరవించుకున్నట్లు అవుతుందన్నారు.

చాగంటి భాగవత సప్తాహంలో కేసీఆర్​

ఇవీ చూడండి: భాగ్యనగరానికి రాష్ట్రపతి కోవింద్.. ఘన స్వాగతం

Last Updated : Dec 20, 2019, 9:49 PM IST

ABOUT THE AUTHOR

...view details