తెలంగాణ

telangana

By

Published : Jan 26, 2022, 1:47 PM IST

Updated : Jan 26, 2022, 5:08 PM IST

ETV Bharat / state

CM KCR: 'రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాటే వినపడకుండా చేయాలి'

state police and excise conference
డ్రగ్స్‌ నివారణపై దృష్టి సారించిన సీఎం

13:43 January 26

రాష్ట్రంలో డ్రగ్స్‌ నివారణపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్‌

మాదక ద్రవ్యాలు వినియోగించే వాళ్ల పట్ల చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించాలని... వాళ్లు ఎంతటి వాళ్లైనా సరే వదిలిపెట్టొద్దని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను నియంత్రించే దిశగా చేపట్టాల్సిన చర్యలపై ప్రగతి భవన్​లో నేడు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్​తో పాటు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ చర్చించారు. డ్రగ్స్ క్రయ విక్రయాలను అడ్డుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కఠిన చర్యల అమలుకై ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

రాష్ట్ర వ్యాప్తంగా వేయి మందితో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని... మాదక ద్రవ్యాలు, వ్యవస్థీకృత నేరాలను అడ్డుకోవాలని డీజీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక సెల్ పని చేయాలని సీఎం సూచించారు. మాదక ద్రవ్యాల నిరోధానికి తీసుకోవాల్సిన కార్యచరణ, విధి విధానాలు రూపొందించడానికి ఈ నెల 28వ తేదీన కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. హోం, ఆబ్కారీ శాఖ మంత్రులు, సీఎస్, డీజీపీ, డీజీలు, సీపీలు, జిల్లాల ఎస్పీలు, ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు, పర్యవేక్షణాధికారులు ఈ సమీక్షలో పాల్గొననున్నారు.

''రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాటే వినపడకుండా చూడాలి. డ్రగ్స్ కేసులో దోషులుగా తేలినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. దోషులు ఎంతటివారైనా సరే కఠినంగా వ్యవహరించాలి. కఠిన చర్యల అమలు కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలి. నార్కోటిక్, ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ సెల్ ఏర్పాటు చేయాలి. వెయ్యి మందితో కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఏర్పాటు చేయాలి. కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్​కు ప్రత్యేక విధులు నిర్వర్తించాలి. డ్రగ్స్, వ్యవస్థీకృత నేరాలను కఠినంగా నియంత్రించాలి''. -సీఎం కేసీఆర్

మాదక ద్రవ్యాలకు సంబంధించిన చాలా కేసుల్లో ఇటు పోలీసులు, అటు ఎక్సైజ్ అధికారులు కేవలం విక్రయదారులపైనే కేసులు నమోదు చేస్తున్నారు. మానవీయ కోణాల్లో ఆలోచించి వినియోగదారులను కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తున్నారు. కానీ వినియోగదారులు మాదక ద్రవ్యాలకు బానిసలై.. మరికొంత మంది బానిసలను తయారు చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వినియోగదారులను వదిలిపెట్టొద్దని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇలాంటి వాళ్లపై చట్టపరంగా కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కేసీఆర్ ఆదేశించడాన్ని బట్టి... పోలీసులు, ఎక్సైజ్ అధికారులు వినియోగదారులపైనా దృష్టి పెట్టనున్నారు. ఎల్లుండి నిర్వహించే సమీక్షా సమావేశంలో డ్రగ్స్ నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్... ఎక్సైజ్, పోలీసు ఉన్నతాధికారులకు దిశా నిర్ధేశం చేయనున్నారు.

ఇదీ చూడండి:Live Video: ఆడపులి వేటను ఎప్పుడైనా చూశారా?

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated : Jan 26, 2022, 5:08 PM IST

ABOUT THE AUTHOR

...view details