హుజూరాబాద్ ఉపఎన్నిక సమీక్షపై వచ్చిన వార్తలు నిజం కాదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(Bhatti Vikramarka on huzurabad review) అన్నారు. హుజూరాబాద్ ఫలితంపై నిన్న దిల్లీలో ఏఐసీసీ సమక్షంలో జరిగిన సమావేశం(AICC review on huzurabad defeat) .. అర్థవంతంగా జరిగిందని భట్టి విక్రమార్క(CLP leader Bhatti Vikramarka) అన్నారు. హూజూరాబాద్ సమీక్షపై వచ్చిన ఏవార్తలో నిజం లేదని తెలిపారు. కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని భట్టి విక్రమార్క విమర్శించారు. గాంధీ భవన్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కలిసి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(TPCC president Revanth Reddy) మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఒక జాతీయ పార్టీ గురించి ఇలాంటి కల్పిత కథనాలు రాయడం సమంజసం కాదని భట్టి అభిప్రాయపడ్డారు. సమీక్ష అనంతరం నిన్న సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో జరిగినవే నిజమని చెప్పారు. కల్పిత కథనాలు ప్రచురితం కాకుండా మీడియా మిత్రులు సహకరించాలని కోరారు. సమస్యలపై కార్యాచరణ రూపొందించి ముందుకెళ్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
హుజూరాబాద్ ఫలితంపై దిల్లీలో ఏఐసీసీ సమీక్ష అర్ధవంతంగా జరిగింది. హుజూరాబాద్ సమీక్షపై వచ్చిన వార్తలు నిజం కాదు. సమావేశం తర్వాత మేము మీడియాకు చెప్పిందే వాస్తవం. ఒక జాతీయ, రాజకీయ పార్టీపై ఇలాంటి కల్పిత కథనాలు రాయడం సమంజసం కాదు. -భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
నెహ్రూకు నివాళులు