Bhatti On KCR: కేంద్ర బడ్జెట్ పేలవంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు విమర్శించారు. భాజపాకు నిధులిస్తున్న కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం కలిగించేట్లు కేంద్ర పద్దు ఉందని ఆరోపించారు. బడ్జెట్‌లో వైద్య, ఆరోగ్య శాఖకు కేటాయింపులు లేవని, కరోనాతో దెబ్బతిన్న పరిశ్రమలు, ఉద్యోగాలు కోల్పోయిన లక్షలాది మందిని ఆదుకునే ప్రయత్నం చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పద్దు ద్వారా కేంద్ర ప్రభుత్వం పేదలకు అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. కేంద్ర బడ్జెట్‌లో విభజన హామీల అమలు ప్రస్తావన లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదాయపన్ను పరిమితి పెంచుతారని ఆశగా ఎదురుచూసిన సామాన్యులకు నిరాశ మిగిల్చాలని మండిపడ్డారు.
Bhatti On KCR: భాజపా ఆలోచననే కేసీఆర్ బయటకు చెప్పారు: సీఎల్పీ నేత భట్టి - కేంద్ర బడ్జెట్ 2022 వార్తలు
Bhatti On KCR: రాజ్యాంగం మార్చాలన్న భాజపా ఆలోచనను కేసీఆర్ బయటకు చెప్పారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. మతతత్వ, ఫ్యూడల్ శక్తులు కలిసి.. భారత రాజ్యాంగం మార్చాలనే కుట్ర చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు.
Bhatti On KCR
రాజ్యాంగం మార్చాలన్న భాజపా ఆలోచనను కేసీఆర్ బయటకు చెప్పారని.. కాంగ్రెస్ నేతలు అన్నారు. భాజపా విధానాన్నే కేసీఆర్ చెప్పారన్నారు. మతతత్వ, ఫ్యూడల్ శక్తులు కలిసి.. భారత రాజ్యాంగం మార్చాలనే కుట్ర చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు.
ఇదీచూడండి:CM KCR Comments: 'దేశంలో గుణాత్మక మార్పు కోసం ఉజ్వలమైన పాత్ర పోషిస్తా..'