హైదరాబాద్‌లోని బాలానగర్ పైవంతెన నిర్మాణానికి భూ, ఆస్తుల సేకరణ ప్రక్రియను వేగవంతం చేసినట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ఆస్తుల సేకరణపై జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఆయన సమీక్షించారు. సమావేశంలో కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, స్థానిక కార్పొరేటర్లు, జోనల్ కమిషనర్ మమత, చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్‌రెడ్డి, టౌన్‌ప్లానింగ్, భూసేకరణ అధికారులు, ఆస్తులు కోల్పోనున్న యజమానులు పాల్గొన్నారు. బాలానగర్ పైవంతెన నిర్మాణంలో మొత్తం 367 ఆస్తులకు గానూ... ఇప్పటికే 120 ఆస్తులకు సంబంధించి ఆమోదం లభించిందని... మరో 76 ఆస్తులు ప్రభుత్వ విభాగాలకు సంబంధించినవి ఉన్నాయని... మిగిలిన 170 ఆస్తులకు సంబంధించి భూసేకరణ చట్టం కింద డిక్లరేషన్ దాఖలు చేయడం జరిగిందన్నారు. ఈ వంతెన నిర్మాణంతో సికింద్రాబాద్, కూకట్‌పల్లి, బాలానగర్, కుత్బుల్లాపూర్, గాజుల రామారం, సుచిత్ర మార్గాల్లో సిగ్నల్ ఫ్రీ రవాణా సౌకర్యం ఏర్పడుతుందని మేయర్ స్పష్టం చేశారు.
జీహెచ్ఎంసీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన నగర మేయర్ - బాలానగర్
హైదరాబాద్‌లోని బాలానగర్ పైవంతెన నిర్మాణానికి సంబంధించి ఆస్తుల సేకరణపై జీహెచ్ఎంసీ కార్యాలయంలో మేయర్ బొంతు రామ్మోహన్ సమీక్ష నిర్వహించారు.
జీహెచ్ఎంసీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన నగర మేయర్