తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్లాస్మా డొనేట్ చేస్తామంటూ డబ్భులు వసూలు

By

Published : Jul 20, 2020, 7:14 PM IST

Updated : Jul 20, 2020, 8:52 PM IST

charge-money-to-donate-plasma
ప్లాస్మా డొనేట్ చేస్తామంటూ డబ్భులు వసూలు

19:08 July 20

ప్లాస్మా డొనేట్ చేస్తామంటూ డబ్భులు వసూలు

ప్లాస్మా దానం చేస్తామంటూ పలువురిని మోసం చేసిన నిందితుడు రెడ్డి సందీప్

ప్లాస్మా దానం చేస్తామంటూ పలువురిని మోసం చేస్తున్న ఓ వ్యక్తిని హైదరాబాద్‌ తూర్పు టాస్క్ ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన రెడ్డి సందీప్‌ ఫేస్‌బుక్, ఇస్టాగ్రామ్‌లలో ప్లాస్మా డొనేట్ చేస్తానంటూ పోస్టులు పెట్టేవాడు. అవసరం ఉన్నవారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తూ బాధితులను మోసం చేసేవాడు.

కొవిడ్ చికిత్సకు ఉపయోగపడే టోసిలిజుమాట్‌-400ను సరఫరాచేస్తానంటూ ఈ విధంగా పలువురిని చీట్​ చేశాడు. ఇప్పటివరకు అతను 200 మందిని మోసం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు రెడ్డి సందీప్‌పై గతంలో రాంగోల్‌పేట, పంజాగుట్టతోపాటు ఏపీలోని పలు పోలీస్​ స్టేషన్లలో కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితుడిని పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు.

ఇదీ చూడండి :ఆస్పత్రుల్లో ఆక్సిజన్​ లేక చనిపోవడం దారుణం : ఉత్తమ్

Last Updated : Jul 20, 2020, 8:52 PM IST

ABOUT THE AUTHOR

...view details