Chandrayaan 3 Success Celebrations in Telangana : చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్.. జాబిల్లిపై దిగడంతో రాష్ట్రవ్యాప్తంగా బుధవారం సందడి నెలకొంది. చంద్రయాన్-3ని విజయవంతం చేసిన ఇస్రో బృందానికి.. మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు. చంద్రుడి దక్షిణ ధృవాన్ని విక్రమ్ ల్యాండర్ చేరుకొని చరిత్ర సృష్టించిందని పేర్కొన్నారు. యావత్ భారత్‌కు గర్వించదగ్గ విషయమన్నారు. విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా ల్యాండ్ అవడం యావత్ భారతం గర్వించే క్షణమని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయిన తొలి దేశంగా భారత్ నిలిచిందని కొనియాడారు. చంద్రయాన్-3 అద్వితీయ ఘట్టాలను.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ లక్ష్మణ్, ఇతర సీనియర్ నాయకులతో కలిసి కిషన్ రెడ్డి వీక్షించారు. ప్రయోగం విజవంతం అనంతరం.. పార్టీ కార్యాలయం వద్ద సంబురాలు జరుపుకున్నారు.
4 గంటల తర్వాత బయటకొచ్చిన రోవర్.. జాబిల్లిపై అసలు పని షురూ! ఎంత వేగంతో వెళ్తుందో తెలుసా?
Chandrayaan 3 Success 2023 : ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్ షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ చరిత్రలో మరుపురాని రోజు అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. ప్రయోగం విజయవంతం కావడంతో.. భాగ్యనగర వాసులు సంబురాలు జరుపుకున్నారు. బీజేపీ కార్పొరేటర్ శ్రీవాణి పార్టీ శ్రేణులతో కలిసి జాతీయ జెండాతో జై భారత్అంటూ నినాదాలు చేశారు. ఖైరతాబాద్ మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో సందడి నెలకొంది. ఖైరతాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో క్లబ్ కమిటీ, ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా భారీ తెరపై చంద్రయాన్-3 ల్యాండింగ్ ప్రక్రియను ప్రదర్శించారు. ప్రయోగం విజయవంతం కావడంతో కేక్ కట్ చేశారు. కుత్బుల్లాపూర్ సుచిత్ర చౌరస్తాలో విజయోత్సవాలు జరిపారు. చార్మినార్ వద్ద పర్యాటకులు, స్థానికులతో కలిసి... పోలీసులు త్రివర్ణ పతాకాలతో ర్యాలీ నిర్వహించారు.
Chandrayaan 3 Landing Success Wishes : చంద్రయాన్-3 సక్సెస్‌తో నా జీవితం ధన్యమైంది : ప్రధాని మోదీ
Chandrayaan 3 Success Celebrations 2023 : ఆదిలాబాద్‌లో సంబురాలు మిన్నంటాయి. చిన్నారులు, పెద్దలు కలిసి టపాసులు పేల్చారు. స్వీట్లు పంచుకున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు కస్తూర్భా పాఠశాల విద్యార్థులు ఇస్రో అక్షరాల పేరుతో కూర్చొని శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. మందమర్రిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో యువకులు, వ్యాపారులు భారీ ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్‌లో సంబురాలు వెల్లివిరిశాయి. పలు పాఠశాలల్లో విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు ప్రయోగాన్ని వీక్షించారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ప్రైవేట్ పాఠశాలలో ప్రయోగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా విద్యార్థులు వీక్షించి ఉద్వేగానికి గురయ్యారు. రానున్న రోజుల్లో శాస్త్రవేత్తలు స్ఫూర్తిగా నిలుస్తారంటూ పేర్కొన్నారు.