తెలంగాణ

telangana

ETV Bharat / state

'నిర్భయ దోషులకు ఉరి అమలుపై కృతనిశ్చయంతో ఉన్నాం' - కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై కేంద్రం కృత నిశ్చయంతో ఉందని, వారికి డెత్ వారెంట్ ప్రకారం ఈ నెల 22నే శిక్ష అమలు జరగాలని కోరుకుంటున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

kishan reddy
'నిర్బయ దోషులకు ఉరి పడాల్సిందే...'

By

Published : Jan 17, 2020, 3:18 PM IST

నిర్భయ దోషుల శిక్ష అమలుపై కేంద్రం కృత నిశ్చయంతో ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. కోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తామని స్పష్టం చేశారు. న్యాయప్రక్రియలో లోపాలు సవరించే పని ప్రారంభించినట్లు, అందులో భాగంగానే ఐపీసీ, సీఆర్పీసీ చట్టాల్లో లోపాలపై అధ్యయనం చేయడానికి కమిటీ ఏర్పాటు చేసినట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పోక్సో చట్టంలో కూడా కేంద్రం మార్పులు చేసిందన్నారు.

నిర్భయ కేసులోనూ డెత్ వారెంట్ ప్రకారం శిక్ష అమలు చేయాలని కోరుకుంటున్నామన్నారు. నిర్భయ తరహా ఘటనల్లో దోషులకు క్షమాపణ తగదని రాష్ట్రపతి గతంలోనే అన్నట్లు గుర్తు చేశారు. హోంశాఖకు వచ్చిన మెర్సీ పిటిషన్‌పై జాప్యం చేయకుండా నిర్ణయం తీసుకున్నామని, ఎన్‌పీఆర్‌పై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని కిషన్ రెడ్డి వెల్లడించారు.

'నిర్బయ దోషులకు ఉరి పడాల్సిందే...'

ఇవీ చూడండి: బస్తీమే సవాల్: సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఫాలోయింగ్​ పనిచేస్తుందా...?

ABOUT THE AUTHOR

...view details