తెలంగాణ

telangana

ETV Bharat / state

Karvi: కార్వీ ఎండీ పార్ధసారథిని ప్రశ్నించిన సీసీఎస్ పోలీసులు

హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు నుంచి రుణం తీసుకొని తిరిగి చెల్లించని కేసు కార్వీ సంస్థ ఎండీ పార్ధసారథిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ప్రశ్నించారు. ఈ కేసులో నాంపల్లి కోర్టు అనుమతితో రెండు రోజుల కస్టడీలోకి తీసుకున్న పోలీసులు పలు ఆధారాలు సేకరించారు.

CCS police
కార్వీ

By

Published : Sep 4, 2021, 7:34 PM IST

Updated : Sep 5, 2021, 12:04 AM IST

కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్​లోని పలు పత్రాలను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ తీర్మానపత్రాలను పెట్టి హెచ్డీఎఫ్సీ బ్యాంకులో రుణం తీసుకున్న కేసులో పోలీసులు పలు ఆధారాలు సేకరించారు. హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి 350 కోట్ల రూపాయలు రుణం తీసుకొని తిరిగి చెల్లించని కేసులో సీసీఎస్ పోలీసులు నాంపల్లి కోర్టు అనుమతితో పార్థసారథిని రెండు రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. రెండు రోజుల పాటు పార్థసారథిని ప్రశ్నించిన పోలీసులు.. కీలక సమాచారం సేకరించారు. అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా కార్యాలయంలో సోదాలు నిర్వహించి పత్రాలు, హార్డ్​డిస్క్​లు స్వాధీనం చేసుకున్నారు. పార్థసారథి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా సీసీఎస్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పార్థసారథి కస్టడీ ముగియడంతో సీసీఎస్ పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. న్యాయస్థానం ఆదేశం మేరకు పార్థసారథిని చంచల్ గూడ జైలుకు రిమాండ్​కు తరలించారు.

గచ్చిబౌలి పీఎస్​లోనూ కార్వీ సంస్థపై కేసు నమోదైంది. ఐసీఐసీఐ బ్యాంకులో దాదాపు 550కోట్ల రుణం తీసుకొని తిరిగి చెల్లించకపోవడంతో ఐసీఐసీఐ ప్రతినిధులు ఫిర్యాదు చేయగా గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును సైబరాబాద్ కమిషనరేట్ లోని ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తు చేస్తోంది. పార్థసారథిని కస్టడీకి ఇవ్వాలని సైబరాబాద్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్​పై సోమవారం వాదనలు జరిగే అవకాశం ఉంది.

Last Updated : Sep 5, 2021, 12:04 AM IST

ABOUT THE AUTHOR

...view details