కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేసిన వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించింది. హైదరాబాద్ ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధిలోనే ఓ వాహనదారుడు నిర్లక్ష్యంగా రోడ్డుపైనే ఉమ్మి వేసి సీసీ కెమెరాల ద్వారా పోలీసులుకు దొరికిపోయాడు.
రోడ్డుపై ఉమ్మి వేసిన వ్యక్తిపై కేసు - రోడ్డుపై ఉమ్మి వేసిన వ్యక్తిపై కేసు
కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఉప్పల్ పీఎస్ పరిధిలో రోడ్డుపై నిర్లక్ష్యంగా ఉమ్మి వేసిన ఎండీ గౌసుద్దీన్పై పోలీసులు కేసు నమోదు చేశారు.
రోడ్డుపై ఉమ్మి వేసిన వ్యక్తిపై కేసు
ఉప్పల్లోని విశాల్ చెక్పోస్ట్ వద్ద ఎండీ గౌసుద్దీన్ బాధ్యతారాహిత్యంగా రోడ్డుపై ఉమ్మివేశాడు. ఇది గమనించిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.
ఇవీ చూడండి: లక్ష మంది రోగులకైనా చికిత్స: కేసీఆర్
TAGGED:
spit case on person at uppal