జగన్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలైన ఓ వ్యాజ్యంలో... న్యాయ సలహాల నిమిత్తం నిధులివ్వాలని 2014లో కొందరు ఐఏఎస్ అధికారులు కోరారు. దీనికి అప్పటి ప్రభుత్వం అంగీకరించింది. సీవీఎస్కే శర్మ... న్యాయవాదికి ఫీజు చెల్లించినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి ప్రజాధనం కాజేశారని ఆరోపిస్తూ ఏవీ రమణ నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. తప్పుడు పత్రాలతో 7 లక్షల 56 వేల రూపాయల బిల్లులను మంజూరు చేయడంలో పీకే మహంతి, పీవీ రమేశ్ ప్రమేయం కూడా ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారించిన నాంపల్లి కోర్టు... సీవీఎస్కే శర్మ, పీకే మహంతి, పీవీ రమేశ్లపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ ముగ్గురిపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రజాధనం కాజేశారని... ముగ్గురిపై కేసు నమోదు - Case filed against these three in illegal money release case
జగన్ అక్రమాస్తుల కేసులో తప్పుడు పత్రాలు సృష్టించి ప్రభుత్వ నిధులు కాజేశారని విశ్రాంత ఐఏఎస్ అధికారి సీవీఎస్కే శర్మపై కేసు నమోదైంది. ఆయనతో పాటు మాజీ సీఎస్ పీకే మహంతి, పీవీ రమేశ్లపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
సీవీఎస్కే శర్మ, మాజీ సీఎస్ పీకే మహంతి, పీవీ రమేశ్లపై కేసు నమోదు
ఇవీ చూడండి : ఒక్క నెలలోనే రూ.1,650 కోట్ల మద్యం తాగేశారు
Last Updated : Nov 1, 2019, 8:55 AM IST